లాక్ డౌన్ సడలింపులో మరిన్ని వెసులుబాట్లు..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 02:48 PM IST
లాక్ డౌన్ సడలింపులో మరిన్ని వెసులుబాట్లు..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. కంటైన్మెంట్, బఫర్ జోన్ల్ మినహా మిగిలిన జోన్లలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇంకా స్పష్టత రాలేదని స్థానిక యంత్రాంగం అంటుంటోంది. ఇక విజయవాడలో మాత్రం ఈనెలాఖరకు పాత పద్ధతినే అమలు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. 

నిన్న సీఎం జగన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. నిత్యవసర వస్తువుల విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా కొన్ని వెసులుబాట్లు కల్పించారు. నిత్యవసర సరుకుల కోసం ఇబ్బంది పడకుండా ఇబ్బంది లేని ప్రాంతంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొన్ని షాపులు తెరిచి ఉంచాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా అధికారులు ప్రభుత్వ ఆర్డర్ ను రిలీజ్ చేశారు.

ఎక్కడెక్కడ షాపులు తెరవాలన్న అంశంపై కొన్ని నిబంధనలు కూడా ఇచ్చారు. కంటైన్ మెంట్ , బఫర్ జోన్లు మినహా మిగిలిన జోన్లలో సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకు కూడా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉన్న లాక్ డౌన్ కు వెసులుబాటు కల్పించాలి..ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని అన్ని దుకాణాలు తెరిచి ఉంచేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే అన్ని షాపులు ఒకే దగ్గర ఉంటే కనుక షాపులన్నింటినీ తెరిస్తే ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు గుమికూడే అవకాశం ఉంది కనుక షాపులకు సరి సంఖ్య, బేసి సంఖ్య నిష్పత్తిలో పక్క పక్కనున్న షాపులను ఒకే రోజు తెరవకుండా ఒకరోజు కొన్ని షాపులు, మరొక రోజు మరికొన్ని షాపులు తెరిచే విధంగా చూడాలని, సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరం మొత్తం రెడ్ జోన్ పరిధిలో ఉంది కాబట్టి ఈ నెలాఖరు వరకు ఉదయం 6 నుంచి ఉదయం 9 గంటల వరకు నడిపే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.