కరోనా కట్టడికి పాల వ్యాపారి భౌతిక దూరం ఐడియా అదుర్స్

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకా

  • Published By: naveen ,Published On : May 11, 2020 / 11:43 AM IST
కరోనా కట్టడికి పాల వ్యాపారి భౌతిక దూరం ఐడియా అదుర్స్

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకా

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలీదు. కాగా, వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ మహమ్మారిని ఏమీ చెయ్యలేదు. అప్పటివరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే. కచ్చితంగా అందరూ మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, డాక్టర్లు చెబుతున్నారు. కరోనా కట్టడికి ముందు జాగ్రత్త తప్ప మరో మార్గం లేదంటున్నారు.

ఈ క్రమంలో తమకు తాము రక్షణ కల్పించుకుంటూ.. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. కాగా, కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఓ పాల వ్యాపారి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాడు. ఇందుకోసం అతడు వేసిన ఐడియా అదుర్స్ అని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ ఆ పాల వ్యాపారి ఏం చేశాడో తెలుసా, తన పాల బండికి పైపును అమర్చాడు. దాని ద్వారా పాలు విక్రయిస్తున్నాడు. పాలు పోయించుకునే వారు దగ్గరికి రావాల్సిన పని లేదు. పైపు దగ్గర గిన్నె పెట్టుకుంటే సరిపోతుంది. పాల వ్యాపారి పైపులో పాలు పోస్తాడు. ఇటువైపు గిన్నెలో పట్టుకోవాలి. పాల వ్యాపారి మాస్కుతో హెల్మెట్‌ ధరించాడు. చేతులకు గ్లౌస్‌లు ధరించి తన వ్యాపారం కొనసాగిస్తున్నాడు.

ఈ దృశ్యాన్ని అహ్మదాబాద్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ నితిన్‌ సంగ్వాన్‌ చిత్రీకరించి ట్వీట్‌ చేశారు. కొంత మంది తమకు తామే రక్షణ కల్పించుకుంటూ.. ఇతరులకు కూడా రక్షణగా నిలుస్తున్నారని ట్వీట్‌లో ఐఏఎస్‌ అధికారి తెలిపారు. మీరు పాల వ్యాపారిలా వినూత్న ఆలోచనలు చేయలేకపోయినా సరే.. కనీసం ఇంట్లోనైనా మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోండని ఆ అధికారి సూచించారు. కాగా, పాల వ్యాపారి ఐడియాను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. వాటాన్ ఐడియా సర్ జీ అని కితాబిస్తున్నారు.

Read Here>>  పార్క్ లో విచిత్రం : మంటలు వ్యాప్తిస్తున్నా కాలిపోని చెట్లు,గడ్డి,బెంచీలు