Anti diabetic Plants : 400 రకాల మొక్కల్లో మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉంది : భారత శాస్త్రవేత్తల వెల్లడి

డయాబెటిస్ నియంత్రణ కోసం ఉపయోగపడే మొక్కలపై భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 400ల రకాల మొక్కలకు డయాబెటిస్ ను నియంత్రించే గుణం ఉందని తెలిపారు.

Anti diabetic Plants : 400 రకాల మొక్కల్లో మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉంది : భారత శాస్త్రవేత్తల వెల్లడి

400 antidiabetic plants

400 antidiabetic plants : ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడేవే. కానీ ఏ మొక్కలు ఏ వ్యాధికి ఉపయోగపడతాయో తెలియదు. బీపీ, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడే మొక్కలు చాలానే ఉన్నాయి. డయాబెటిస్ ఇప్పుడు ఈ ప్రమాదం చాలా ఉంది. ఈక్రమంలో డయాబెటిస్ నియంత్రణ కోసం ఉపయోగపడే మొక్కలపై భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 400ల రకాల మొక్కలకు డయాబెటిస్ ను నియంత్రించే గుణం ఉందని తెలిపారు. అనేక రకాల ఔషధ మొక్కలు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గించే గుణాలు కలిగి ఉన్నాయని తెలిపారు. టైప్-2 మధుమేహం నిర్వహణలో సహాయపడే సామర్థ్యాన్ని 400ల రకాల మొక్కల్లో ఉన్నాయని భారత శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

 

వాటిలో వేప, పసుపు, ఉసిరి, నేరేడు, మెంతి, దారుహరిద్ర, చిన్న పొట్ల, బెండ, విజయసర్ సహా 21 రకాలపైనే లోతైన పరిశోధనలు జరిగాయని తెలిపారు. మధుమేహాన్ని నియంత్రించేందుకు వాడే అనేకరకాల అల్లోపతి ఔషధాలకూ మూలికల మూలాలు ఉన్నాయని తెలిపింది శాస్త్రవేత్తల బందం. సహజసిద్ధ ఉత్పత్తులపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తే మరిన్ని కొత్త మందుల అభివృద్ధికి వీలు కలుగుతుందని తెలిపారు.

నష్టం.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

జిప్‌మెర్‌-పుదుచ్చేరి, ఎయిమ్స్‌-కల్యాణి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి రూపొందించిన బీజీఆర్‌-34 వంటి మూలికా ఔషధాలకు మధుమేహాన్ని నియంత్రించే సామర్థ్యం ఉందని తెలిపారు. ఈ రుగ్మత బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో వనమూలికలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచటానికి, యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచటానికి కూడా ఔషధ మొక్కలు ఉపయోగపడతాయని AIMIL ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంచిత్ శర్మ తెలిపారు.