మిర్యాలగూడలో డెంటల్ డాక్టర్ శ్వేత ఆత్మహత్య, అసలేం జరిగింది

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. డెంటల్ డాక్టర్ శ్వేత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో

  • Published By: naveen ,Published On : May 14, 2020 / 08:40 AM IST
మిర్యాలగూడలో డెంటల్ డాక్టర్ శ్వేత ఆత్మహత్య, అసలేం జరిగింది

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. డెంటల్ డాక్టర్ శ్వేత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. డెంటల్ డాక్టర్ శ్వేత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. పట్టణంలోని రెడ్డి కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో శ్వేత తన భర్తతో నివాసం ఉంటుంది. ఆమె భర్త పేరు బండారు కుమార్. అతడు కూడా డాక్టరే. చిన్న పిల్లల వైద్య నిపుణుడు. శ్వేత, కుమార్ దంపతులకు తొమ్మిదేళ్ల పాప ఉంది.

2009లో కుమార్ తో వివాహం:
మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన అనంతుల నాగయ్య, పుష్ఫలత దంపతుల కుతూరు డాక్టర్ శ్వేత దంత వైద్యురాలు. శ్వేతను శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన పిల్లల వైద్యుడు బండారు కుమార్‌ తో 2009లో పెళ్లి చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో అద్దెకు ఉంటున్నారు. అయితే కుమార్ మిర్యాలగూడలోని ప్రాంతీయ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. శ్వేత పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో స్టార్ ఆస్పత్రిని నిర్వహిస్తోంది.

భర్త ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చే సరికి:
బుధవారం(మే 13,2020) ఉదయం భర్త కుమార్ ఆస్పత్రికి వెళ్లగా, తాను బయట షాపింగ్‌కు వెళ్తున్నానని చెప్పి కుమార్తెను శ్వేత పక్కింటికి పంపించింది. మధ్యాహ్నా సమయంలో ఆస్పత్రి నుంచి భర్త కుమార్ వచ్చేసరికి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. భార్యను ఎంత పిలిచినా స్పందించకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచాడు. అప్పటికే శ్వేత చనిపోయి ఉంది.

కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు:
కొంతకాలంగా భార్యాభర్తల నడుమ వివాదాలు జరుగుతున్నాయని.. తరచూ గొడవ పడేవారని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. చనిపోయే ముందు శ్వేత సూసైడ్ నోట్ రాసింది. తన చావుకి ఎవరూ కారణం కాదంటూ రాసి ఉన్న డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు భర్తతో జీవితాంతం కలిసి బతకాలని ఉన్నా.. భర్త ప్రశాంతంగా లేను అంటున్నాడని ఆ డైరీలో శ్వేత వాపోయింది.

నాకోసం ఎవరూ పోట్లాడుకోవద్దు, కేసులు పెట్టుకోవద్దు:
తన కూతురికి సారీ చెబుతూ ఆమె రాసిన నోట్ స్థానికులను కలచివేసింది. అత్త దగ్గర ఉండాలంటూ కూతురికి సూచించింది. అలాగే తన పేరు మీదున్న ఆస్తులు తన అత్త వసంతకు చెందాలని నోట్ లో రాసింది. తన వల్ల ఎవరూ పోట్లాడుకోకూడదని.. కేసులు పెట్టుకోవద్దని కోరింది. చివరగా నా కోసం ఏడ్వొద్దంటూ రాసి పెట్టి ఆమె ఆత్మహత్య చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కాగా కూతురి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడం వల్లే శ్వేత ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఆ దిశగానూ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Read Here>> వరంగల్ లో హిజ్రా హత్య..లైంగిక వేధింపులే కారణమా?