తెలంగాణను వీడని కరోనా : కొత్త కేసులు 40

  • Published By: madhu ,Published On : May 16, 2020 / 12:06 AM IST
తెలంగాణను వీడని కరోనా : కొత్త కేసులు 40

తెలంగాణ రాష్ట్రంలో కరోనా భయం వీడడం లేదు. ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ఎక్కడో ఒకచోట వైరస్ బారిన పడుతుండడం కలకలం రేపుతోంది. రెండంకెల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

2020, మే 15వ తేదీ…శుక్రవారం..మరో 40 మందికి కరోనా వైరస్ సోకిందని ప్రభుత్వం వెల్లడించింది. ఎప్పటిలాగానే GHMCలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 33 మందికి వైరస్ సోకిందని హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏడుగురు వలస కూలీలకు వైరస్ సోకింది. 

మొత్తంగా వలస వచ్చిన వారిలో ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 44కి చేరింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1454కు పెరిగింది. శుక్రవారం 13 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన వారు ఐదుగురు, వికారాబాద్, కొముం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ వైరస్ బారిన పడి 34 మంది చనిపోయారు. 

మూడు జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదు. గత 14 రోజులుగా 26 జిల్లాలో పాజిటివ్ కేసులు రిజిస్టర్ కాలేదు. వైరస్ కట్టడికి ప్రజలు సహకరించాని, తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం వెల్లడించింది. తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని అధికారులు సూచించారు. 

మొత్తం కేసులు : 1454
డిశ్చార్జ్ అయిన వారు : 959
చికిత్స పొందుతున్న వారు : 461
మరణాలు : 34