వలస కూలీలకు సీఎం జగన్ ఆసరా : సొంతూళ్ల వరకు ఫ్రీగా ప్రయాణం..భోజనం..షెల్టర్

  • Published By: madhu ,Published On : May 17, 2020 / 06:45 AM IST
వలస కూలీలకు సీఎం జగన్ ఆసరా : సొంతూళ్ల వరకు ఫ్రీగా ప్రయాణం..భోజనం..షెల్టర్

వలస కూలీలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. తమ ప్రభుత్వం వీరికి ఆసరగా నిలబడుతుందని, వీరికి ఎలాంటి కష్టాలు ఎదురుకాకుండా చూస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ రాష్ట్రం నుంచి వెళ్తున్న కూలీలకు ఆసరాగా ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. మానవతా దృక్పథంతో వారిని ఆదుకొంటోంది. ఏ రాష్ట్రం చేయని విధంగా ఉచితంగా బస్సు, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 

శ్రీకాకుళం, ఒంగోలు తదితర ప్రాంతాలనుంచి సుమారు 900 మంది కూలీలను సురక్షితంగా పంపారు ఏపీ అధికారులు. 2020, మే 17వ తేద ఆదివారం ఉదయం గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి మరో 500 మందిని పంపించింది. వీరి ప్రయాణం సాఫీగా సాగేలా ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. 

ఇదిలా ఉంటే..వలస కూలీలకు అందుతున్న సహాయక చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటివరకూ అందించిన సహాయ కార్యక్రమాలపై వివరాలు అందించారు అధికారులు. కాలినడకన ఒడిశా వెళ్తున్న 902 మందిని షెల్టర్లలో చేర్చి అన్ని సదుపాయాలు అందించామన్నారు. వీరిని తిరిగి బస్సుల్లో పంపించామన్నారు.

ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా నుంచి 10 బస్సుల్లో 470 మంది, కృష్ణాజిల్లా నుంచి 16 బస్సుల్లో 410 మంది, శ్రీకాకుళం నుంచి 1 బస్సులో 22 మందిని పంపించామన్న అధికారులు వెల్లడించారు. గుంటూరు నుంచి 450 మందిని, కృష్ణా జిల్లా నుంచి 52 మంది వలస కూలీలను పంపిస్తున్నామని తెలిపారు. నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదని…భోజనం, ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్న విషయాన్ని కూలీలకు వివరిస్తున్నామని చెప్పారు. 

భోజనం, ఇతరత్రా సదుపాయాల విషయంలో వారికి లోటు రానివద్దన్న సీఎం జగన్ సూచించారు. ఖర్చులు గురించి ఆలోచించవద్దని ఉదారంగా, మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయాలన్నారు. సీఎం ఆదేశాలతో నడుచుకుంటూ వెళ్తున్న వారిని షెల్టర్లకు తరలిస్తున్నారు అధికారులు. వీరికి భోజనంతో పాటు ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.