NCP Working Presidents: సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‭లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన శరద్ పవార్

ఈ ప్రకటన పార్టీ ముఖ్య నేత అయిన అజిత్ పవార్ ముందే జరిగింది. వీరికే కాకుండా.. మరింత మంది నేతలకు వివిధ బాధ్యతలు అప్పగించారు. ఎన్సీపీ జాతీయ జనరల్ సెక్రెటరీ అయిన సునీల్ తత్కారేకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, రైతులు, మైనారిటీ విభాగాన్ని అప్పగించారు

NCP Working Presidents: సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‭లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన శరద్ పవార్

Maharashtra Politics: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‭లను నియమిస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. పార్టీ స్థాపించి 24 ఏళ్లు పూర్తై 25వ ఏడులోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా, బారామతి నుంచి లోక్‭సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సూప్రియా సూలే ఇప్పటికే ఎన్సీపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి చీఫ్‭గా ఉన్నారు. తాజాగా ఆమెకు మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, మహిళ విభాగం, లోక్‭సభ కోర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. ప్రఫుల్ పటేల్‭కు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా బాధ్యతలు ఇచ్చారు.

Revanth Reddy: కర్ణాటకలో సిద్ధరామయ్యకూ కోరిన సీటు ఇవ్వలేదు.. ఇక తెలంగాణలో..: రేవంత్ రెడ్డి

ఈ ప్రకటన పార్టీ ముఖ్య నేత అయిన అజిత్ పవార్ ముందే జరిగింది. వీరికే కాకుండా.. మరింత మంది నేతలకు వివిధ బాధ్యతలు అప్పగించారు. ఎన్సీపీ జాతీయ జనరల్ సెక్రెటరీ అయిన సునీల్ తత్కారేకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, రైతులు, మైనారిటీ విభాగాన్ని అప్పగించారు. ఇక నంద శాస్త్రీని ఢిల్లీ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఎన్సీపీని 10 జూన్ 1999లో పీ.ఏ సంగ్మా, తారిక్ అన్మర్‭లతో కలిసి శరద్ పవార్ స్థాపించారు.

Nellore Politics : నెల్లూరు జిల్లాలో మారిపోతున్న రాజకీయాలు, కోటంరెడ్డితో మాజీ మంత్రి భేటీ.. టీడీపీలోకి ఆనం ఎంట్రీ

ఇకపోతే నూతన బాధ్యతలపై శరద్ పవార్‭కు సుప్రియా సూలే కృతజ్ణతలు తెలిపారు. ఈ విషయమై ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఎన్సీపీ 25వ వార్షికోత్సవంలో నేను ప్రఫుల్ పటేల్ పార్టీకి నూతన వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియామకం అయ్యాము. నాకు ఈ బాధ్యత ఇచ్చిన పార్టీకి చాలా కృతజ్ణతలు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు కష్టపడతాను. పార్టీ నుంచి నాకు మద్దతుగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు, అభిమానులకు ధన్యవాదాలు. అలాగే పవార్ సార్‭కి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని ట్వీట్ అన్నారు.