Corona కేసులు పెరగకూడదని ఆంధ్ర నుంచి తెలంగాణకు నో ఎంట్రీ

  • Published By: Subhan ,Published On : May 17, 2020 / 02:03 PM IST
Corona కేసులు పెరగకూడదని ఆంధ్ర నుంచి తెలంగాణకు నో ఎంట్రీ

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కొద్ది రోజులుగా మళ్లీ పెరుగుతుండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రజలు రావొద్దని ఆంక్షలు విధించింది. ఈ మేరకు కొద్ది రోజులుగా పాసులు ఇష్యూ చేయడం ఆపేసింది. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు తెలంగాణకు రావడం కష్టం అన్నమాట. 

తెలంగాణ నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రావాలనుకునేవారికి కూడా నో ఎంట్రీ చెప్తోంది. మూడు రోజులుగా అధికారులు పాసులు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. కరోనా కేసుల్లో టాప్ ప్లేస్ లో మహారాష్ట్ర ఉంది. 30వేల 706కేసులు కన్ఫామ్ అవగా వెయ్యి 135మరణాలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

ఆ తర్వాత వరుసలోనే గుజరాత్ 10వేల 989 కన్ఫామ్ కేసులతో రెండో వరుసలో ఉండగా 625 కరోనా మృతులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసుల రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది తెలంగాణ గవర్నమెంట్.

కొద్ది రోజుల ముందు ఏపీ నుంచి వస్తున్న ప్రజలకు అనుమతించిన ప్రభుత్వం చెక్ పోస్ట్ వద్ద స్క్రీనింగ్ నిర్వహించింది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని తిరిగి ఏపీకి పంపేసి 14రోజుల హోం క్వారంటైన్ లో ఉండాలని స్టాంపులు వేసి పంపింది.