Indira Gandhi: ఇందిరా గాంధీ హత్యపై ఖలిస్తానీలు నిర్వహించిన పరేడ్‭లో తప్పేం లేదట.. కెనడా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వివాదాదస్పద వ్యాఖ్యలు

అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బందే 1984 అక్టోబరు 31న అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను గుర్తు చేసుకుంటూ ఖలిస్థాన్ మద్దతుదారులు జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఈ పెరేడ్‌ను నిర్వహించారు

Indira Gandhi: ఇందిరా గాంధీ హత్యపై ఖలిస్తానీలు నిర్వహించిన పరేడ్‭లో తప్పేం లేదట.. కెనడా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వివాదాదస్పద వ్యాఖ్యలు

Canadian Law Enforcement: భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యను ఖలిస్తాన్ మద్దతుదారులు కెనడాలో నిర్వహించినట్లు నెట్టింట్లో వీడియో వైరల్ అవుతోంది. ఒక వాహనంపై రక్తపు మడుగులో నిల్చున్న ఇందిరా ప్రతిమ ఉండగా.. ఆమెను కాలుస్తున్నట్లు ఉన్న ఇద్దరు సాయుధుల ప్రతిమలు కూడా ఉన్నాయి. ఈ వీడియోపై దేశంలో దుమారం చెలరేగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ వారు సైతం దీన్ని ఖండించారు. ఈ వార్తలు వైరల్ అవ్వడంతో న్యూఢిల్లీలోని కెనడియన్ హై కమిషనర్ కామెరూన్ మెక్‌కే ఘాటుగా స్పందించారు. కెనడాలో విద్వేషానికి, హింసకు తావు లేదని, అలాంటి వాటిని కీర్తించే అవకాశం ఎంత మాత్రం లేదని అన్నారు.

Rajasthan Politics: సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? అనుమానాలకు తావిస్తున్న తండ్రి వర్ధంతి సందేశం

అయితే దేశం నుంచి ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా.. కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించింది. బ్రాంప్టన్ నగరంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో ఎటువంటి ద్వేషపూరిత భావం లేదని కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ పేర్కొంది. ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది 1984లో అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో భాగంగా 1984 జూన్ 6న భారతీయ దళాలు స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించాయి.

Delhi Police : హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన పెళ్లికూతురు.. స్పందించిన ఢిల్లీ పోలీసులు

అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బందే 1984 అక్టోబరు 31న అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను గుర్తు చేసుకుంటూ ఖలిస్థాన్ మద్దతుదారులు జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఈ పెరేడ్‌ను నిర్వహించారు. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 39 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ పెరేడ్‌ను నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి.

Arvind Kejriwal: దేశ వ్యాప్తంగా ఈ ఆర్డినెన్సు తీసుకువస్తున్నారు.. నాకు సమాచారం అందింది: కేజ్రీవాల్ వార్నింగ్

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ బ్యానర్‌లు ఉన్నాయని వీడియోల్లో చూడొచ్చు. కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్‌పై భారత ప్రభుత్వం బుధవారం తీవ్ర అసంతృప్తి, విచారం వ్యక్తం చేసింది. కెనడా ప్రభుత్వానికి తన అసంతృప్తిని తెలిపింది. కెనడా రాజధాని ఒట్టావాలోని ఇండియన్ హై కమిషన్ బుధవారం గ్లోబల్ అఫైర్స్ కెనడాకు ఓ ఫార్మల్ నోట్‌ను పంపించింది. ఇటువంటి చర్యలు ఆమోదించదగినవి కాదని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్ర్యం పరిధిని అతిక్రమించకూడదని తెలిపింది.

Karnataka Politics: ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభానికి ముందే మరో సంచలన ప్రకటన చేసిన కర్ణాటక సీఎం

ఓ ప్రజాస్వామిక దేశపు నాయకురాలి హత్యను ఘనంగా కీర్తిస్తూ పెరేడ్ నిర్వహించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు ఇలాంటివి మంచివి కాదని భారతదేశంలోని కెనడా హైకమిషనర్ కెమెరూన్ మాకేతో విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు. అయితే కెనడాలో ద్వేషానికి కానీ, అలాంటి చర్యలను కీర్తించడానికి చోటు లేదని ఇండియాలో కెనడా హై కమిషన్ కార్యాలయం పేర్కొంది. ఆ తర్వాతే కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ పై విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం.