Adipurush : ఆదిపురుష్‌కి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? సీత పాత్ర కోసం మొదటి అనుకున్న హీరోయిన్ ఎవరు..?

ప్రభాస్ ఆదిపురుష్ రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి సిద్దమవుతుంది. కాగా ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ తెలుసుకోండి.

Adipurush : ఆదిపురుష్‌కి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? సీత పాత్ర కోసం మొదటి అనుకున్న హీరోయిన్ ఎవరు..?

Prabhas remuneration for Adipurush and first option instead of Kriti Sanon

Prabhas Adipurush : ప్ర‌భాస్ (Prabhas) రాముడిగా కనిపిస్తూ చేస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కృతి స‌న‌న్ (Kriti Sanon) సీత‌గా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావ‌ణాసురుడిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన ట్రైలర్స్ అండ్ సాంగ్స్ తో మూవీ పై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ తెలుసుకోండి.

Adipurush : ‘ఆదిపురుష్’ కి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. అందుకు గ్రీన్ సిగ్న‌ల్‌..

ఈ సినిమాకి ముందుగా అనుకున్న బడ్జెట్ రూ.400 కోట్లు. కానీ టీజర్ రిలీజ్ అయిన తరువాత గ్రాఫిక్స్ విషయంలో భారీ ట్రోలింగ్ ఎదురుకోవడంతో.. రీ వర్క్ కోసం మరో 100 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో సినిమాకి మొత్తంగా 500 కోట్లు బడ్జెట్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి గాను ప్రభాస్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నాడు. దాదాపు 150 కోట్లు పారితోషకాని అందుకున్నాడట. దేశంలో ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకొని రియల్ పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు ప్రభాస్.

Adipurush : తెలుగు తెర పై శ్రీరాముడిగా కనిపించిన నటులు.. వెండితెరపై మొదటి రాముడు ఎవరో తెలుసా?

ఇక ఈ సినిమాలో సీతగా కృతిసనన్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కృతి కంటే ముందు ఆ పాత్ర కోసం అనుష్క శెట్టి, కీర్తి సురేష్, కియారా అద్వానీ, అనుష్క శర్మ పేరులను సంప్రదించారట. అయితే చివరిగా ఆ పాత్ర చేసే అదృష్టం కృతినే వరించింది. తన హైట్ వల్లే తనని ఆ పాత్ర కోసం ఎంపిక చేయడం జరిగిందని కృతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాని రిలీజ్ కి ముందే ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో (Tribeca Film Festival) ప్రదర్శించబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఏమైందో తెలియదు గాని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.