Ashes Test 2023: యాషెస్ టెస్టు మొదటి రోజు.. ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు ఎందుకు నల్లటి బ్యాండ్‌లు ధరించారో తెలుసా?

యాషెస్ తొలిటెస్టు ప్రారంభంకు ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు నాటింగ్‌హోమ్ దాడిలో మృతులకు నివాళిగా చేతికి నల్ల బ్యాండ్‌లు ధరించారు.

Ashes Test 2023: యాషెస్ టెస్టు మొదటి రోజు.. ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు ఎందుకు నల్లటి బ్యాండ్‌లు ధరించారో తెలుసా?

Ashes Series 2023

Ashes Series 2023:: ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 393 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీ (118 పరుగులు)తో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ జట్టు 450 పరుగుల వద్ద డిక్లేర్డ్ ప్రకటిస్తే బాగుండేదని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే, బజ్‌బాల్ క్రికెట్ తో ఇంగ్లండ్ కు అనుకూల ఫలితాలు వస్తున్నప్పటికీ ప్రతీసారి ఆ మంత్రం పనిచేయకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Double hat-trick : క్రికెట్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డు.. ఆరు బంతుల‌కు 6 వికెట్లు.. అదీ ఒకే ఓవ‌ర్‌లో.. 12 ఏళ్ల కుర్రాడి ఘ‌న‌త‌

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లకు యాషెస్ టెస్ట్ ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ క్రమంలో ఆసిస్ తొలి ఇన్సింగ్‌లో ఇంగ్లాండ్ అంచనాలకు మించిరాణిస్తే తొలి టెస్ట్ ఇంగ్లండ్ జట్టు చేజారిపోయే అవకాశాలు లేకపోలేదు. శనివారం ఆసీస్ జట్టు ప్రదర్శనను బట్టి ఇంగ్లాండ్ జట్టు తీసుకున్న నిర్ణయం ఎంతమేరకు కరెక్ట్ అనేది తేలిపోతుందని మాజీలు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలాఉంటే యాషెస్ తొలిటెస్టు ప్రారంభంకు ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు చేతికి నల్లబ్యాండ్ లు ధరించారు. అయితే, వారు ఎందుకు నల్ల బ్యాండ్‌లను ధరించారనే విషయంపై చర్చజరుగుతుంది.

Asia Cup 2023: ఆగస్టు 31 నుంచి ఆసియా కప్… 4 మ్యాచులు పాక్‌లో, మరో తొమ్మిదేమో…

నాటింగ్‌హోమ్ దాడిలో మృతులకు నివాళులర్పించేందుకు బర్మింగ్‌హోమ్‌లో జరుగుతున్న మొదటి టెస్టుకు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్‌లు ధరించారు. అనంతరం క్రీడాకారులు, అధికారులు ఒక నిమిషం మౌనం పాటించారు. గత రెండు రోజుల క్రితం నాటింగ్‌హోమ్‌లో భారత సంతతికి చెందిన గ్రేస్ ఓమల్లీకుమార్, ఆమె స్నేహితురాలతోపాటు మరో వ్యక్తిపై ఓ దుండగుడు కత్తితో దాడిచేశాడు. ఆ తరువాత వ్యాన్‌తో ఢీకొట్టాడు. అతడి దాడిలో ముగ్గురు మరణించారు. భారత సంతతికి చెందిన గ్రేస్ ఓ మల్లీకుమార్ ప్రతిభావంతులైన క్రికెట్, హామీ క్రీడాకారిణి. ముగ్గురు మృతికి నివాళిగా క్రికెటర్లు నల్ల బ్యాండ్‌లు ధరించారు.