PM Modi US Visit: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో.. ఏ సమయానికి ఏ కార్యక్రమంలో పాల్గొంటారు.. పూర్తి షెడ్యూల్ ఇలా..

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా.. జూన్ 20న న్యూయార్క్ వెళ్తారు. 21నుంచి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

PM Modi US Visit: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో.. ఏ సమయానికి ఏ కార్యక్రమంలో పాల్గొంటారు.. పూర్తి షెడ్యూల్ ఇలా..

PM Narendra Modi America Tour

Modi-Biden Meet: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) జూన్ 21 నుంచి 25వ తేదీ వరకు అమెరికా (America), ఈజిప్ట్ (Egypt) దేశాల్లో పర్యటించనున్నారు. అమెరికాలో 24వరకు ప్రధాని పర్యటన ఉంటుంది. ప్రధాని అమెరికా పర్యటన భారత్ – అమెరికా సంబంధాలలో కీలకమైన ఘట్టంగా ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ 2014 నుంచి ఆరు సార్లు అమెరికాలో పర్యటించారు. ఒరాక్ ఒబామా (Barack Obama), డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), జో బిడెన్ (Joe Biden) ముగ్గురు అధ్యక్షులతో పలుసార్లు భేటీ అయ్యారు. అయితే, ఈసారి మోదీ అమెరికా పర్యటన ప్రత్యేకంమని చెప్పొచ్చు. ప్రత్యేక ఆహ్వానం మేరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా యొక్క సన్నిహిత మిత్రులు, స్నేహితులకోసం ప్రత్యేకించబడిన గౌరవాన్ని మోదీ అందుకోనున్నారు.

Modi-Biden Meet : బైడెన్‌తో.. మోదీ ఏం చర్చించబోతున్నారు? ప్రపంచ దేశాల దృష్టి అంతా వీరి భేటీ మీదే..!

మోదీ పర్యటన సాగుతుంది ఇలా.. 

–   ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో భాగంగా.. జూన్ 20న న్యూయార్క్ వెళ్తారు. మోదీకి అండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద భారతీయ అమెరికన్ల బృందం స్వాగతం పలకనుంది.
–   జూన్ 21న న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే వేడుకలకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తారు.
–   యూఎన్ ప్రధాన కార్యాలయం నుంచి మోదీ వాషింగ్టన్ డీసీకి వెళ్తారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్‌లు స్వాగతం పలుకుతారు. అనంతరం వారితో కలిసి ప్రైవేట్ విందులో పాల్గొంటారు.
–   జూన్ 22న ప్రధాని మోదీకి వైట్ హౌస్ వద్ద లాంఛనప్రాయ స్వాగతం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో సహా వెయ్యి మందికిపైగా స్థానిక ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.
–   స్వాగత కార్యక్రమం తరువాత మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. రెండు దేశాల ఆర్థిక, సాంకేతిక, పర్యావరణ వ్యవస్థల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ చర్చలు ద్రోహదపడతాయని ఇరుదేశాల అధికారులు పేర్కొంటున్నారు.
–   ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ, సెనేట్ మెజారిటీ నాయకుడు చక్ ఘమెర్‌తో సహా కాంగ్రెస్ నేతల ఆహ్వానం మేరకు అదేరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.
–   బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ జూన్ 22న సాయంత్రం ప్రధాని మోడీ గౌరవార్ధం స్టేట్ డిన్నర్ ను ఏర్పాటు చేస్తారు. వందల మంది అతిథులు, కాంగ్రెస్ సభ్యులు, దౌత్య వేత్తలు, ప్రముఖులు ఈ విందులో పాల్గొంటారు.

–   జూన్ 23న ప్రధాని మోదీకి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రాష్ట్ర కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ సంయుక్తంగా లంచ్‌లో ఆతిథ్యం ఇస్తారు. అనంతరం పలువురు సీఈఓలు, పలు రంగాల నిఫుణులు, ఇతరులతో మోదీ సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.
–   జూన్ 23న సాయంత్రం రోనాల్డ్ రీగన్ సెంటర్ లో జరిగే మెగా ఈవెంట్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
–   అమెరికా పర్యటన తరువాత జూన్ 24 ప్రధాని మోదీ ఈజిప్టుకు వెళ్తారు. ఆ దేశ అధ్యక్షులు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసిని కలుసుకుంటారు. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకునేవిధంగా చర్చలు జరగనున్నాయి. అయితే, ప్రధాని మోదీ ఈజిప్ట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.