Lakshmi Manchu : మంచు లక్ష్మీ మనసు ‘మంచు’ అంటున్న నెటిజెన్స్.. ఎందుకో తెలుసా..?

మంచు లక్ష్మి చేస్తున్న పని చూసి నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. మంచు లక్ష్మి మనసు మంచు అంటూ..

Lakshmi Manchu : మంచు లక్ష్మీ మనసు ‘మంచు’ అంటున్న నెటిజెన్స్.. ఎందుకో తెలుసా..?

Lakshmi Manchu adopt 30 government schools under teach for change

Lakshmi Manchu : మంచు లక్ష్మి గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటిగా, యాంకర్ గా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే తన గొప్ప మనసుతో ఆఫ్ స్క్రీన్ లో కూడా అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే మంచు కుటుంబం తమ విద్య సంస్థలతో ఎంతో మందికి ఉన్నతమైన విద్యని అందరికి అందుబాటులో ఉండేలా అందిస్తూ వస్తున్నారు. అయితే మంచు వారసురాలు అక్కడితో ఆగిపోకుండా ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ అనే ఎన్జీవోని స్థాపించి ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తున్నారు.

Baby Movie : బేబీ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈ మాన్‌సూన్‌ని ప్రేమతో..

ఆ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి కూడా స్మార్ట్ క్లాసులు, ఇంగ్లీష్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ఎంతో మంది పిల్లలకి చదువు పరంగా సపోర్ట్ చేస్తూ వారి భవిషత్తుకి తోడుపాటుని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీకాకుళం, యాదాద్రి జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు నిర్వహించేలా ఏర్పాటు చేశారు మంచు లక్ష్మి. తాజాగా ఆమె జోగుళాంబ గద్వాల జిల్లాలో మరో 30 పాఠశాలలను దత్తతకు తీసుకున్నారు.

Pop Singer Madonna : ఐసీయూలో అమెరికన్ పాప్ సింగర్.. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో ఇంటెన్సివ్ కేర్‌‌లో!

ఈ బుధవారం 28న గద్వాల కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వల్లూరు క్రాంతిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ కార్యక్రమం వలన ఇప్పటికే అమలు చేసిన పాఠశాల విద్యార్థుల్లో మంచి ఫలితాలను చూస్తున్నాము. ఆ ఫలితాలే మాకు స్ఫూర్తిగా నిలిచి ప్రతి ఏటా మరికొన్ని జిల్లాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేలా చేస్తుంది. ఇక ఈ ఏడాది జోగుళాంబ గద్వాల జిల్లాలో 30 స్కూల్స్ ని ఎంపిక చేశాం. వాటిలో స్మార్ట్ క్లాసులుతో పాటు అన్ని వసతులు కలిపించేలా చర్యలు తీసుకుంటాము” అని తెలియజేశారు. మంచు లక్ష్మి నిర్ణయం పై గద్వాల కలెక్టర్‌ వల్లూరు క్రాంతి హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం బయటకి రావడంతో.. సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు ఆమెను అభినందిస్తూ.. “మంచు లక్ష్మి మనసు మంచు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.