Jawan : షారుఖ్ జవాన్.. కేవలం మ్యూజిక్ రైట్స్‌కి ఏకంగా అన్ని కోట్లా..?

ఇటీవల పఠాన్ సినిమా సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు షారుఖ్. ఇదే సక్సెస్ కంటిన్యూ చేస్తూ జవాన్ ని కూడా సూపర్ హిట్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో షారుఖ్ సొంతంగా తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Jawan : షారుఖ్ జవాన్.. కేవలం మ్యూజిక్ రైట్స్‌కి ఏకంగా అన్ని కోట్లా..?

ShahRukh Khan Jawan Movie Music Rites sold for very high amount

ShahRukh Khan :  తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ లో షారుఖ్ హీరోగా జవాన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. జవాన్ సినిమాని సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఇటీవల పఠాన్ సినిమా సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు షారుఖ్. ఇదే సక్సెస్ కంటిన్యూ చేస్తూ జవాన్ ని కూడా సూపర్ హిట్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో షారుఖ్ సొంతంగా తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Adipurush : ఆదిపురుష్ టీంకు షాక్.. ఆన్లైన్‌లో లీక్ అయిన ఒరిజినల్ ప్రింట్.. మరోవైపు పడిపోయిన కలెక్షన్స్..

జవాన్ సినిమా మ్యూజిక్ రైట్స్ ఏకంగా 36 కోట్లకు బాలీవుడ్ అగ్ర మ్యూజిక్ ఛానల్ అయిన T సిరీస్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. కేవలం ఒక్క పాటల రైట్స్ కి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో జవాన్ సినిమా మ్యూజిక్ రైట్స్ ఇప్పటివరకు ఏ సినిమాకి లేనంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక మ్యూజిక్ రైట్స్ 36 కోట్లు వస్తే జవాన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో అని ఆలోచిస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు.