బీఆర్ఎస్‌కు నేనొక్కడినే చాలు, సీఎం రేవంత్ అమెరికాకు వెళితే నేను చూసుకుంటా- మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదు. బీఆర్ఎస్ వాళ్లు కావాలని చేసుకుంటున్న ప్రచారం.

బీఆర్ఎస్‌కు నేనొక్కడినే చాలు, సీఎం రేవంత్ అమెరికాకు వెళితే నేను చూసుకుంటా- మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళితే చూసుకోవడానికి తాను ఉన్నానని అన్నారు. బీఆర్ఎస్ కు నేనొక్కడినే చాలు అని ఆయన వ్యాఖ్యానించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడికీ వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ తోనే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఛాంబర్ కు వెళ్లినంత మాత్రాన ఆ పార్టీలో చేరినట్టేనా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి. కేటీఆర్ నా చైర్ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆయన కాంగ్రెస్ లో చేరినట్టేనా అని అడిగారు.

కాగా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే బండ్ల.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే బండ్ల తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారనే వార్తలపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు.

ఛాంబర్ కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్లా?- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
” బీఆర్ఎస్ ఛాంబర్ కు వెళ్లినంత మాత్రాన ఆ పార్టీలో చేరినట్లా? కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గరకి వచ్చి మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా? బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటారు. ఆయన ఎక్కడికీ వెళ్లరు. జగదీశ్ రెడ్డిని నేను అన్న మాటలకు ఆయనే ఒప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తే.. నేను ఉన్నాగా చూసుకోవడానికి. బీఆర్ఎస్ కు నేను చాలు. బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిమూట్లకు సబ్సిడీ ఇస్తాం. ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ కు త్వరలోనే రీ టెండర్. వర్షా కాలంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడతాం. ప్రతిపక్ష పాత్ర కీలకమైనది. కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారు. కేసీఆర్ కు ప్రజలపై ప్రేమ లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ముగ్గురూ కలిసి రేవంత్ రెడ్డిని ఓడించలేకపోయారు. రేవంత్ రెడ్డికి వాళ్లు ఎలా సరిపోతారు?”.

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఓపిక లేదు- యెన్నం శ్రీనివాస్ రెడ్డి
”గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఓపిక లేదు. అక్కడ ఆయన చెప్పినట్లు పార్టీ యావత్ ప్రయార్టీ ఇచ్చాము. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మనుషులకు అవకాశాలు ఉండాలని అడిగాడు. దానికీ సరే అన్నాము. జిల్లాలో బీసీ మహిళ అయిన జెడ్పీ చైర్మన్ ను ఎక్కడికీ రావొద్దు, ఆమెను అధికార కార్యక్రమాలకు పిలవొద్దు అన్నారు. ఇది సాధ్యం కాదని అన్నాము. అది సరికాదన్నాము. ఒక ఎమ్మెల్యే అయి ఉండి పార్టీలో, అధికారులపై గ్రిప్ సంపాదించుకోవాలి. అధికారంలో ఉన్నపుడే బీఆర్ఎస్ మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడేం చేస్తుంది. DMK, TDP లాంటి పార్టీలకు ఒక ఫిలాసఫీ ఉంది. బీఆర్ఎస్ కి ఏ ఫిలాసఫీ ఉంది. B తొలగించి T పెట్టే దమ్ముందా? దేశంలో అన్నీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి.
మోడీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యి… రాహుల్ గాంధీ కి గ్రాఫ్ పెరిగింది. రాష్ట్రంలో పథకాలు అమలు కావడం లేదన్నారు. అన్నీ చేసి చూపిస్తున్నాము కదా. యాదాద్రి పవర్ ప్లాంట్ లో కుంభకోణం గురించి ఎందరికి తెలుసు.

తెల్లం వెంకటరావు ఎక్కడికీ పోరు- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
”తెల్లం వెంకటరావు ఎక్కడికీ పోరు. పాత పరిచయం కాబట్టి కలసి ఉంటారు. మా దగ్గరికి వచ్చిన వాళ్లు ఎవరూ ఇబ్బంది కలగకుండా ఉంటారు. మా దగ్గర ప్రేమ రాజకీయాలు ఉంటాయి. ఎవరూ ఎక్కడికీ పోరు”.

ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదు- విప్ ఆది శ్రీనివాస్
”ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదు. బీఆర్ఎస్ వాళ్లు కావాలని చేసుకుంటున్న ప్రచారం. బండ్ల కృష్ణమోహన్ కు అక్కడి స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. బీఆర్ఎస్ కావాలని లీక్ లు ఇస్తోంది. అందరు ఎమ్మెల్యేలు ఉంటారు. ఇంకా కొత్త వాళ్లు జాయిన్ అవుతారు.”

నేను కచ్చితంగా మంత్రిని అవుతా- ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
”నేను కచ్చితంగా మంత్రిని అవుతా. ఏం మంత్రి అవుతా అనేది మాత్రం చెప్పలేను. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను నేను. నాకు మంత్రి పదవి రాకుండా ఎలా ఉంటుంది? రాష్ట్ర జనాభాలో 40శాతం జనాభా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలదే. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలను విస్మరించినట్లే.

నేను పార్టీ మారే ప్రసక్తి లేదు- ఎమ్మెల్యే కాలె యాదయ్య
”నేను పార్టీ మారే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగతా. తెల్లం వెంకట్రావ్ ఫోటోలు తీసి కావాలని వైరల్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. నేను అప్పుడు, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా. మూడుసార్లు ఎమ్మెల్యేను నన్ను కాదని భీం భరత్ ఏం చేస్తాడు?”.

అటు అసెంబ్లీ మెంబర్స్ ఎంట్రీ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీమంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎదురుపడ్డారు. భట్టన్న నా మీద ప్రేమ లేదా అని మల్లారెడ్డి అనగా.. చాలా ప్రేమ ఉందంటూ మల్లారెడ్డిని ఆలింగనం చేసుకున్నారు భట్టి విక్రమార్క. అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు.

Also Read : అటు దక్కని పదవి, ఇటు నిరుద్యోగుల ఒత్తిడి.. ప్రొఫెసర్‌ కోదండరాంకి చివరికి మిగిలిందేంటి?