France Protests: అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఆందోళనలు

హింసాత్మక ఘటనలతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. వరుసగా నాలుగో రోజు కొనసాగుతున్న ఆందోళనలతో ఫ్రాన్స్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

France Protests: అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఆందోళనలు

France Protests

France Protests fourth day: 994 మంది అరెస్ట్ అయ్యారు.. 200 మంది పోలీసులు గాయపడ్డారు.. 4 రోజులుగా.. అల్లర్లతో ఫ్రాన్స్ అట్టుడుకుతూనే ఉంది. ఏ వీధిని చూసినా.. రణరంగంగానే కనిపిస్తోంది. ఇదంతా.. 17 ఏళ్ల టీనేజర్ కోసమే. పారిస్ (Paris) శివార్లలో పోలీసుల కాల్పుల్లో ఆ యువకుడు చనిపోయిన తర్వాత.. దేశం మొత్తం ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. స్కూళ్లు, పోలీస్ స్టేషన్లు, టౌన్ హాల్స్, గవర్నమెంట్ ఆఫీసులకు.. ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్క పారిస్ ప్రాంతంలోనే 45 వేల మంది పోలీసులను మోహరించారంటే.. పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మరణించడంతో.. ఫ్రాన్స్ మొత్తం ఉద్రిక్తతలు చెలరేగాయి. ఫ్రెంచ్ వీధుల్లో ఆందోళనకారులు సృష్టిస్తున్న బీభత్సం, విధ్వంసకాండ అంతా ఇంతా కాదు. వాహనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు.. ఇలా.. ఏవి కనిపిస్తే వాటికి.. నిప్పు పెడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు.. ప్రభుత్వం ఇప్పటికే 6 వందల మందికి పైగా అరెస్ట్ చేసింది. అల్లర్లలో 200 మంది పోలీసులు గాయపడ్డారు. అయినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మంగళవారం నాటికి పారిస్ శివారు ప్రాంతాల్లో మొదలైన ఈ అల్లర్లు.. ఇప్పుడు దేశమంతటికీ పాకాయి. భవనాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెడుతున్నారు. అల్లర్లలో పాల్గొంటున్న వారిలో ఎక్కువగా యూతే ఉంటున్నారు. ఉద్రిక్తతల కారణంగా పారిస్ శివారులోని క్లామర్ట్ టౌన్‌లో కర్ఫ్యూ విధించారు.

పారిస్‌ శివార్లలోని డిఫెన్స్‌ డిస్ట్రిక్ట్‌ దగ్గర నాంటెర్రే అనే ప్రదేశంలో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ సమయంలో ఆందోళనకారులు అక్కడే ఉన్న సామాగ్రికి నిప్పు పెట్టి.. భద్రతా దళాలపైకి సీసాలు, రాళ్ల వంటివి విసిరారు. అదే సమయంలో భద్రతా దళాలు ఓ భవనం దగ్గరికి చేరి ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. ఫ్రాన్స్‌లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు.. నహేల్ అనే 17 ఏళ్ల అల్జీరియా యువకుడిని ఓ పోలీసు కాల్చి చంపాడు. ఆ యువకుడి మరణం తర్వాత ఈ అల్లర్లు చెలరేగాయి. ఘటన జరిగిన మంగళవారం రాత్రి పారిస్‌ శివారు ప్రాంతాల్లో మొదలైన ఉద్రిక్తతలు.. ఇప్పుడు దేశమంతటికీ పాకాయి. భవనాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు.

Also Read: టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదం జరిగి 10 రోజులైనా గడవకముందే.. ఓషన్ గేట్ యాడ్స్!

యువకుడిపై కాల్పులు ఘటన తర్వాత.. పోలీసుల చర్యపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయంలో.. తమను తాము సమర్థించుకునేందుకు పోలీసు అధికారులు ప్రయత్నించారు. కానీ.. అల్లర్ల తర్వాత సీన్ మారిపోయింది. ఆందోళనకారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాఠశాలలకు, పోలీస్‌ స్టేషన్లకు, టౌన్‌ హాల్స్‌కు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు బుధవారం రాత్రి నిప్పు పెట్టారు. దాదాపు 100 ప్రభుత్వ భవనాలకు నష్టం వాటిల్లింది. ఒక్క పారిస్‌ ప్రాంతంలోనే 45 వేల మంది పోలీసులను మోహరించారు.

Also Read: ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. కూల్‌గా కూర్చుని సాండ్‌విచ్ తింటున్న కుర్రాడు

ఇక.. నహేల్‌పై కాల్పులు జరిపిన పోలీసు అధికారి ప్రాసిక్యూషన్‌ కూడా ప్రారంభమైంది. అతడిపై హత్యాభియోగం నమోదైంది. యువకుడిని కాల్చి చంపిన అధికారి.. మృతుడి కుటుంబీకులకు క్షమాపణలు చెప్పాడు. పోలీసు తరపు లాయర్ మాట్లాడుతూ.. మనుషులను చంపడం అతని ఉద్దేశం కాదని, పొరపాటున జరిగిందని వివరించారు. అయినప్పటికీ.. అల్లర్లు ఆగట్లేదు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు.. రాత్రి 9 గంటల తర్వాత పారిస్ బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా అంతా ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు.