The Legend of Hanuman : ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 వచ్చేస్తుంది.. మొదటి రెండు బ్లాక్ బస్టర్..

ఆదిపురుష్ ఎఫెక్ట్ తో రామాయణ కథతో ఆల్రెడీ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొన్ని పాత చిత్రాలకు మళ్ళీ ఆదరణ పెరుగుతుంది. ఈ క్రమంలోనే..

The Legend of Hanuman : ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 వచ్చేస్తుంది.. మొదటి రెండు బ్లాక్ బస్టర్..

The Legend of Hanuman animated series season 3 coming soon

The Legend of Hanuman : రామాయణం కథాంశంతో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆదిపురుష్ (Adipurush) సినిమా వల్ల ఆ మూవీ మేకర్స్ కి పెద్దగా లాభం జరగలేదు గాని ఇతర మేకర్స్ మాత్రం బాగానే కలిసొస్తుంది. రామాయణం కథని సరిగా చూపించలేకపోవడమే కాకుండా పాత్రలను కూడా సరిగ్గా చూపించలేకపోయారని విమర్శలు ఎదురుకొని కోర్టు వరకు చేరుకున్నారు. ఇక ఈ మూవీ ఫెయిల్యూర్ తో రామాయణ కథతో ఆల్రెడీ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొన్ని పాత చిత్రాలకు మళ్ళీ ఆదరణ పెరుగుతుంది.

Niharika – Chaitanya : నాలుగు నెలల తర్వాత నిహారిక భర్త చైతన్య వైరల్ పోస్ట్.. మెడిటేషన్ సెంటర్‌లో!

ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ టెలివిజన్ సీరియల్ ‘రామాయణం’ని జులై 3 నుంచి మళ్ళీ రీ టెలికాస్ట్ చేయనున్నారు. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar) లో హనుమంతుడి పాత్రని మెయిన్ లీడ్ గా తీసుకోని ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ అనే పేరుతో ఒక యానిమేటెడ్ సిరీస్ 2021 జనవరిలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. 13 ఎపిసోడ్స్ తో వచ్చిన మొదటి సీజన్ మంచి సక్సెస్ అయ్యింది. ఆ తరువాత జులైలో సెకండ్ సీజన్ కూడా 13 ఎపిసోడ్స్ తో రిలీజ్ అయ్యి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మూడో సీజన్ సిద్దమవుతుంది.

Bro Movie : మరో మూడు వారాల్లో రిలీజ్.. ఇంకా పూర్తి కానీ షూటింగ్.. ఫారిన్‌లో బ్రో సాంగ్ మేకింగ్..

త్వరలోనే సీజన్ 3ని తీసుకు రాబోతున్నట్లు హాట్ స్టార్ తెలియజేసింది. ఇక న్యూస్ తెలియడంతో ఈ సిరీస్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆదిపురుష్ కంటే ఈ సిరీస్ చాలా బాగుంటుంది, ముందు రెండు సీజన్లు చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగుతో పాటు మొత్తం 7 భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. శరద్ దేవరాజన్, జీవన్ జె కాంగ్, చరువి అగ్రవాల్ ఈ సిరీస్ ని రూపొందించారు.