Pathaan : ఆ దేశంలో రిలీజ్‌కి రెడీ అయిన పఠాన్.. RRR రికార్డు బద్దలుకొడుతుందా?
పఠాన్ సినిమా ఈ జనవరిలో రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించింది. చాలా రోజుల తర్వాత ఓ సినిమా బాలీవుడ్(Bollywood) లో హిట్ టాక్ తెచ్చుకొని భారీ కల్క్షన్స్ సాధించింది.
![Pathaan : ఆ దేశంలో రిలీజ్‌కి రెడీ అయిన పఠాన్.. RRR రికార్డు బద్దలుకొడుతుందా? Pathaan : ఆ దేశంలో రిలీజ్‌కి రెడీ అయిన పఠాన్.. RRR రికార్డు బద్దలుకొడుతుందా?](https://10tv.in/wp-content/uploads/2023/07/pathaan.jpg)
Shahrukh Khan Pathaan Movie ready to release in Japan
Pathaan Movie : షారుఖ్(Shahrukh Khan), దీపికా(Deepika Padukone) జంటగా, జాన్ అబ్రహం(John Abraham) విలన్ గా, సిద్దార్థ్ ఆనంద్(Siddharth Anand) దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా ఈ జనవరిలో రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించింది. చాలా రోజుల తర్వాత ఓ సినిమా బాలీవుడ్(Bollywood) లో హిట్ టాక్ తెచ్చుకొని భారీ కల్క్షన్స్ సాధించింది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుఖ్ హిట్ కొట్టడమే కాకుండా గత రెండేళ్లుగా ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ పెద్ద విజయం అందుకుంది. ఈ సినిమా ఓవరాల్ గా 1033 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.
బాహుబలి, RRR, KGF పూర్తి కలెక్షన్స్ రికార్డులు బద్దలుకొట్టకపోయినా హిందీ రికార్డులు మాత్రం పఠాన్ సినిమా కొట్టేసింది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్, బాలీవుడ్ సంబరాలు చేసుకున్నారు. పఠాన్ ఇప్పటికే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే పఠాన్ సినిమా ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అవ్వబోతుంది. 1 సెప్టెంబర్ 2023న పఠాన్ సినిమా జపాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్.
జపాన్ లో ఇండియన్ సినిమాలకు ఫుల్ గిరాకీ ఉన్న సంగతి తెల్సిందే. బాలీవుడ్ సినిమాలతో పాటు మన తెలుగు సినిమాలకు కూడా అక్కడా భారీగా అభిమానులు ఉన్నారు. ప్రభాస్, రజినీకాంత్, షారుఖ్ ఖాన్.. ఇలా అనేకమంది హీరోలకు జపాన్ లో ఫ్యాన్స్ ఉన్నారు. RRR సినిమాతో ఎన్టీఆర్, చరణ్ లకు కూడా జపాన్ లో అభిమానులు ఏర్పడ్డారు. జపాన్ లో రజినీకాంత్ సినిమాల రికార్డుని RRR సినిమా బద్దలుకొట్టింది. కలెక్షన్స్, ఎక్కువ రోజులు ఆడటం, ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం.. ఇలా ఇండియన్ సినిమాల రికార్డులన్నీ ఇప్పుడు జపాన్ లో RRR సినిమాపైనే ఉన్నాయి. మరి ఈ రికార్డులని పఠాన్ సినిమా బద్దలుకొడుతుందా? RRR కంటే పఠాన్ ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందా చూడాలి.
‘PATHAAN’ TO RELEASE IN JAPAN… #YRF’s #Blockbuster #Pathaan will release in #Japan with subtitles… 1 Sept 2023 release… OFFICIAL POSTER for #Japanese market…#SRK #DeepikaPadukone #JohnAbraham #SiddharthAnand pic.twitter.com/YmDthocrdd
— taran adarsh (@taran_adarsh) July 5, 2023