Nayakudu Trailer : మహేశ్ బాబు విడుదల చేసిన నాయకుడు ట్రైలర్ చూశారా..?
ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), కీర్తి సురేష్ (Keerthy Suresh), వడివేలు (Vadivelu) లు కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం మామన్నన్ (Maamannan).
![Nayakudu Trailer : మహేశ్ బాబు విడుదల చేసిన నాయకుడు ట్రైలర్ చూశారా..? Nayakudu Trailer : మహేశ్ బాబు విడుదల చేసిన నాయకుడు ట్రైలర్ చూశారా..?](https://10tv.in/wp-content/uploads/2023/07/Nayakudu-Trailer.jpg)
Nayakudu Trailer
Nayakudu movie Trailer : ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), కీర్తి సురేష్ (Keerthy Suresh), వడివేలు (Vadivelu) లు కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘మామన్నన్’ (Maamannan). మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కింది. తమిళనాట ఈ సినిమా ఘన విజయం సాధించింది. దీంతో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి ‘నాయకుడు’ ((Nayakudu)) పేరుతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి.
Mahnoor Baloch : షారుఖ్ ఖాన్కు నటన రాదు.. పెద్ద అందగాడేం కాదు.. నటి సంచలన వ్యాఖ్యలు
ఈ నెల 14న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. అందులో భాగంగా దర్శకుడు రాజమౌళి, హీరో మహేశ్ బాబు(Mahesh Babu) సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. రాజకీయ నాయకుల అండ కలిగిన ఓ చోటా లీడర్, ఆ పట్టణంలోని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. అతడి ఆగడాలకు బయటపెట్టాలని సాక్షాలను సేకరించడానికి హీరో ఏం చేశాడు అన్నది కథగా తెలుస్తోంది. ఏ ఆర్ రహమాన్ అందించిన సంగీతం బాగుంది.