Pests In Sugarcane Plantations : లేత చెరకుతోటల్లో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఈకాలంలో చీడపీడలు కూడా తమ ప్రతాపాన్ని చూపెడుతూ వుంటాయి. వీటిలో ముఖ్యంగా లేతదశలోఆశించే పీకపురుగు నష్టం ఎక్కువగా వుంటుంది. రైతులు సకాలంలో దీనిని నివారించకపోతే పెరుగుదల దశలో కాండం తొలుచు పురుగుగా మారి నష్ఠం మరింత ఎక్కువగా వుంటుంది.

Pests In Sugarcane Plantations : లేత చెరకుతోటల్లో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Pests In Sugarcane Plantations

Pests In Sugarcane Plantations : ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ర్టాలలో సాగవుతున్న వాణిజ్యపంటల్లో చెరకు ప్రధానమైనది. ప్రస్తుతం పంట 2 నెలల వయస్సు నుంచి పెరుగుదల దశ వరకు వుంది. ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాటేందుకు సిద్దపడుతున్నారు. అయితే అసలే ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో లేత వయసులోని చెరకు తోటలు  నీటి ఎద్దడికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటంతోపాటు సస్యరక్షణ పట్ల కూడా రైతులు కొంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఈదశలో పీకపురుగు ఉధృతి ఎక్కువగా వుంటుందంటూ నివారణకు పాటించాల్సిన సస్యరక్షణా చర్యలను తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, కోడెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజ్ కుమార్.

READ ALSO : Varieties of Sugarcane : చౌడు భూములకు అనువైన చెరకు రకాలు

ఉభయరాష్ట్రాలలోను అధిక విస్థీర్ణంలో సాగవుతున్న వాణిజ్యపంట చెరకు. ఇది దీర్ఘకాలిక పంట. దాదాపు 9 నెలల నుండి 12 నెలల వరకు పొలంలోనే ఉంటుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వర్షాధారంగా సాగుచేస్తూ ఉంటారు. ఈ రకాల్లో బాల్యదశ అత్యంత కీలకమైనది. వేసవిలో చెరకు పిలకలు వృద్ధిచెందుతాయి కాబట్టి ఈ సమయంలో నీటిఎద్దడికి గురికాకుండా దగ్గర దగ్గరగా నీటితడులను అందించాలి.

READ ALSO : Intercrop Cultivation : పామాయిల్ లో అంతర పంటగా చెరకు సాగు

ఈకాలంలో చీడపీడలు కూడా తమ ప్రతాపాన్ని చూపెడుతూ వుంటాయి. వీటిలో ముఖ్యంగా లేతదశలోఆశించే పీకపురుగు నష్టం ఎక్కువగా వుంటుంది. రైతులు సకాలంలో దీనిని నివారించకపోతే పెరుగుదల దశలో కాండం తొలుచు పురుగుగా మారి నష్ఠం మరింత ఎక్కువగా వుంటుంది. కాబట్టి  సకాలంలో గుర్తించి తగిన సస్యరక్షణా చర్యలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజ్ కుమార్.

READ ALSO : Shrimp Cultivation : వర్షాకాలంలో రొయ్యల సాగుకు పొంచి వున్న వ్యాధుల ముప్పు

చెరకుకు పురుగులతో పాటు తెగుళ్లు కూడా నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎర్రనల్లి, మొజాయిక్ తెగులు , కొరడా తెగులు కూడా చెరకు ఎదుగుదలను అడ్డుకుంటాయి.  ఇవి ఆశించిన మొక్కల్లో మొవ్వు పొడుగైన నల్లని కొరడాగా మారుతుంది.

READ ALSO : Sugarcane Crop : చలికాలంలో చెరకు పంటకు నష్టం కలిగించే తుప్పు తెగులు, నివారణ మార్గాలు!

మొవ్వునుండి కొరడా వచ్చిన 3, 4 రోజుల వరకు తెల్లని పల్చని పొర కప్పబడి ఉంటుంది. ఆ తరువాత పొర చిట్లి, ఒక్కో కొరడా నుండి సుమారు 50 కోట్ల తెగులు కారక శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా , వర్షపు జల్లుల ద్వారా పరిసర ప్రాంతాలలోనికి వెదజల్లబడి తెగులు వ్యాప్తికి దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.