Android Apps : మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే ఇప్పుడే డిలీట్ చేసేయండి.. లేదంటే.. మీ డేటా చైనా చేతుల్లోకి.. ఇదిగో ప్రూఫ్..!

Android Apps : ఆండ్రాయిడ్ యాప్స్ వాడుతున్నారా? స్పైవేర్‌ కలిగిన యాప్స్ భారతీయ యూజర్ల డేటాను చైనాలోని సర్వర్‌కు పంపుతున్నారని సర్వేలో తేలింది.

Android Apps : మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే ఇప్పుడే డిలీట్ చేసేయండి.. లేదంటే.. మీ డేటా చైనా చేతుల్లోకి.. ఇదిగో ప్రూఫ్..!

Android Apps with over 10 lakh downloads found with spyware sending data to China

Android Apps : మీ ఫోన్‌లో ఈ ఆండ్రాయిడ్ యాప్స్ వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ డేటా ప్రైవసీకి ముప్పు పొంచి ఉందని తెలుసా? స్పైవేర్‌తో కూడిన యాప్‌లు డివైజ్ నుంచి కనెక్ట్ చేసిన అన్ని అకౌంట్లు, రియల్ టైమ్ యూజర్ లొకేషన్, మరిన్నింటి నుంచి చైనాలోని సర్వర్‌లకు యూజర్ల కాంటాక్టు లిస్టులో సహా డేటాను పంపుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.

డౌన్‌లోడ్ చేసే ముందే ఏ డేటాను ఆయా యాప్‌లు సేకరిస్తాయో యూజర్లకు తెలియజేసేందుకు (Google Play) గత ఏడాదిలో ప్రైవసీ-కేంద్రీకృత లేబుల్ రిలీజ్ చేయడం ప్రారంభించింది. అయితే, స్కామర్లు డెవలపర్‌లు, యూజర్ల డేటాను దొంగిలించడానికి సిస్టమ్‌లో ఒక మార్గాన్ని కనుగొన్నట్లు కనిపిస్తోంది. మొబైల్ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ప్రాడియోలోని సైబర్‌ సెక్యూరిటీ విశ్లేషకుల ప్రకారం.. గూగుల్ ప్లే (Google Play)లోని రెండు యాప్‌లు చైనాలోని డేంజరస్ సర్వర్‌లకు డేటాను పంపుతున్న స్పైవేర్‌తో కనుగొన్నారు. స్పైవేర్‌తో నిండిన యాప్‌ల వల్ల 10 లక్షల మంది వినియోగదారులు ప్రభావితమవుతున్నారని సంస్థ పేర్కొంది. ఆయా యాప్ డౌన్‌లోడ్ పేజీలో డేటాను సేకరించలేదని పేర్కొన్నాయని కంపెనీ తెలిపింది.

Read Also : Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఈ వెర్షన్ గురించి గూగుల్‌ని హెచ్చరించిందని పేర్కొంది. చైనీస్ స్పైవేర్‌తో ఉన్న రెండు యాప్‌లు ‘File Recovery data recovery’, ‘File Manager‘ అనే రెండూ ‘Wang Tom’ పేరుతో ఒకే డెవలపర్ ద్వారా పేర్లు సూచించినట్లుగా ఉంది. యాప్ యూజర్లకు డేటాను నిర్వహించడానికి కొన్ని సందర్భాల్లో ‘మీ ఫోన్ టాబ్లెట్‌లు లేదా ఏదైనా ఆండ్రాయిడ్ డివైజ్‌ల నుంచి డిలీట్ చేసిన ఫైల్‌లను తిరిగి పొందడంలో సాయపడుతుంది. వినియోగదారులు ఇప్పటికీ యాప్‌లను ఉపయోగిస్తుంటే వాటిని వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో పైన పేర్కొన్న రెండు అప్లికేషన్‌ల ప్రొఫైల్‌లు యూజర్ డివైజ్‌ల నుంచి ఎలాంటి డేటాను సేకరించడం లేదని ప్రకటించాయి. అది తప్పుడు సమాచారమని కనుగొన్నారు.

Android Apps with over 10 lakh downloads found with spyware sending data to China

Android Apps with over 10 lakh downloads found with spyware sending data to China

డివైజ్ నుంచి కనెక్ట్ చేసిన అన్ని అకౌంట్ల నుంచి రియల్ టైమ్ యూజర్ లొకేషన్, మొబైల్ కంట్రీ కోడ్, నెట్‌వర్క్ ప్రొవైడర్ పేరు, SIM ప్రొవైడర్ నెట్‌వర్క్ కోడ్, డివైజ్ బ్రాండ్‌తో సహా యూజర్ల కాంటాక్టు లిస్టులో సహా డేటాను సేకరిస్తున్నాయని పరిశోధనా సంస్థ సూచించింది. స్పైవేర్‌తో నిండిన ఆండ్రాయిడ్ యాప్‌లు చట్టబద్ధమైన సర్వీసులను అందిస్తున్నందున గూగుల్ ప్లే సెక్యూరిటీ చెకింగ్ ఆమోదించి ఉండవచ్చు. యాప్‌లను డౌన్‌లోడ్ చేసే ముందు యూజర్లు తప్పనిసరిగా రివ్యూలను చూడాలని పరిశోధన సంస్థ సూచించింది. యాప్‌లు అధిక డౌన్‌లోడ్ ఉంటాయి.. రివ్యూలకు మాత్రం ఎలాంటి రెడ్ ఫ్లాగ్ ఉండవు. వినియోగదారులు ఈ యాప్ పర్మిషన్ అంగీకరించే ముందు వాటిని జాగ్రత్తగా చదవాలని సంస్థ పేర్కొంది.

ముఖ్యంగా, ఇదే రీసెర్చ్ సంస్థ గత ఏడాది వినియోగదారుల ఫేస్‌బుక్ ఆధారాలను దొంగిలించే లక్షకు పైగా డౌన్‌లోడ్‌లతో ‘cartoonifier’ యాప్‌ను కనుగొంది. కార్టూనిఫైయర్ యాప్‌లో పరిశోధకులు ‘FaceStealer’ అనే ట్రోజన్‌ ఫైల్ కనుగొన్నారు. యాప్ హోమ్‌పేజీకి వెళ్లడానికి ముందు యూజర్లు లాగిన్ చేయాల్సిన (Facebook) లాగిన్ స్క్రీన్‌ను ట్రోజన్ కలిగి ఉన్నట్టు నివేదిక తెలిపింది. మీ డేటాను ఎంటర్ చేసిన తర్వాత యాప్ దొంగిలించిన డేటాను హానికరమైన సర్వర్‌కు పంపుతుంది. అందుకే, ఇలాంటి యాప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని డేటా రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.

Read Also : Ola Prime Plus Service : ఓలా ‘ప్రైమ్ ప్లస్’ సర్వీస్‌.. ఇక నో క్యాన్సిలేషన్.. బెంగళూరులో పూర్తి స్థాయిలో ప్రారంభం!