Chikoti Praveen Security Personnel : చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదు

తనకు ప్రాణ హాని ఉందని ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. గన్స్ కు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూయించారని వెల్లడించారు. డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించాలని సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు పంపించానని చెప్పారు.

Chikoti Praveen Security Personnel : చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదు

Chikoti Praveen Chathrinaka police

Chathrinaka Police Registered Case : క్యాసినో చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదు అయింది. చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బందిపై ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. U/s: 420, 467, 468, 471 IPC, Sec 25(1),(b)(A) & Sec 30 of Arms Act కింద వారిపై కేసులు నమోదు చేశారు. చీటింగ్ తో పాటు ఫోర్జరీ, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బంది సుందర్ నాయక్, రాకేష్ కుమార్, రమేష్ లపై కేసులు నమోదు చేశారు.

వెపన్స్ లైసెన్స్ ఫేక్ డాక్యుమెంట్లుగా పోలీసులు తేల్చారు. కాగా, వెపన్స్ లైసెన్స్ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏడాది క్రితం ఛత్రినాక పోలీస్ స్టేషన్ కు పంపామని చికోటి ప్రవీణ్ అంటున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు అంటున్నారు. గజ్వేల్ ఘటన తర్వాత తనను టా‌ర్గెట్ చేశారని చికోటి ప్రవీణ్ పేర్కొన్నారు. మతం కోసం, హిందుత్వం కోసం తాను పోరాటం చేస్తానని అన్నారు.

Chikoti Praveen: బోనాల వేళ.. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం వద్ద కలకలం రేపిన చీకోటి ప్రవీణ్ అనుచరులు

ఈ మేరకు సోమవారం చీకోటి ప్రవీణ్ 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు ప్రాణ హాని ఉందని ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. గన్స్ కు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూయించారని వెల్లడించారు. డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించాలని సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు పంపించానని చెప్పారు. వారు డాక్యుమెంట్స్ చూసి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని పేర్కొన్నారు.

ఇప్పుడు డాక్యుమెట్స్ ఫోర్జరీ అని కేసు నమోదు చేశారని తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని సైదాబాద్ పోలీసులు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇందుకు పోలీసుల తప్పిదమే కారణమని చెప్పారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో పార్టీ జాయిన్ గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేక తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Chikoti Praveen : ఒక్కొక్కటిగా వెలుగులోకి క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు

కాగా, ఆదివారం హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన చీకోటి ప్రవీణ్ అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చీకోటి ప్రవీణ్ అనుచరులు గన్ తో ఆలయం లోపలికి వెళ్ళారు. ఆలయ సిబ్బంది గుర్తించి వారిని పోలీసులకు అప్పగించారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులు చీకోటి అనుచరులను అదుపులోకి తీసుకుని, గన్ తో పాటు ముగ్గురిని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. గన్ లైసెన్స్ కు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ గా ఛత్రినాక పోలీసులు గుర్తించారు. దీంతో చీకోటి ప్రవీణ్ అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.