Actor Suman: మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ను కలిసిన సినీనటుడు సుమన్.. కీలక వ్యాఖ్యలు

అప్పట్లో హైదరాబాద్‌కు సినీ పరిశ్రమ రావాలని ఇక్కడే సినిమాలు తీయాలని..

Actor Suman: మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ను కలిసిన సినీనటుడు సుమన్.. కీలక వ్యాఖ్యలు

Actor Suman

Updated On : July 19, 2024 / 4:40 PM IST

Suman Met AP Minister: ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ను సినీనటుడు సుమన్ ఇవాళ అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ తీరకలేకుండా ఉండడంతో ఇప్పటి వరకూ తాను ఎవరినీ కలవలేదని అన్నారు. రేపు ప్రోగ్రాం ఉందని, అందుకే ఒక రోజు ముందు వచ్చి అందరినీ కర్టసీగా కలుస్తున్నానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో అవకాశం కల్పించడం, స్టూడియోలు కట్టడమే కాకుండా మరిన్ని పనులు చేయాలని అన్నారు. చిన్న సినిమాలు ఆడాలంటే లోకేషన్లు కూడా బాగా ఉండాలని తెలిపారు. పెద్ద సినిమాలు 20 శాతం మాత్రమే ఏపీలో తీసి మిగిలినవి విదేశీ లోకేషన్లలో తీస్తున్నారని చెప్పారు. తమిళంతో పాటు మలయాళ సినిమాల వారు రాసే కథల్లో స్వేచ్ఛ ఉంటుందని, వారు ఎక్కడికైనా వెళ్లి సినిమాలు తీస్తారని తెలిపారు.

అప్పట్లో హైదరాబాద్‌కు సినీ పరిశ్రమ రావాలని ఇక్కడే సినిమాలు తీయాలని, 20 శాతం బయట తీయాలని నిబంధన పెట్టారని చెప్పారు. హైదరాబాద్ లోకేషన్లు అన్నింటిలో ఇప్పటికే సినిమాలు తీసేశామన్నారు. ప్రేక్షకులు కొత్త లొకేషన్లు ఉంటే తప్ప సినిమాలను ఆదరించడం లేదని చెప్పారు. పెద్ద సినిమాలకు సెట్స్ వేయడానికి డబ్బు ఉంటుందని, చిన్న సినిమాలకు ఉండదని అన్నారు. ఫిలిం సిటీలా ఏపీలో చిన్నచిన్న సెట్ కట్టాలని చెప్పారు.

Also Read : గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కి అరుదైన గౌర‌వం..