Crop Loan Waiver : రైతు రుణమాఫీ షురూ.. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ

రైతు వేదికల దగ్గర సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Crop Loan Waiver : రైతు రుణమాఫీ షురూ.. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ

Crop Loan Waiver : సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని గురువారం సాయంత్రం ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయంలో బటన్ నొక్కి రూ.6,098 కోట్ల నిధులను రిలీజ్ చేశారు. తొలి విడతలో రూ.లక్ష వరకు రుణం తీసుకున్న 11.08 లక్షల మంది రైతులకు లబ్ది కలిగినట్లు అయ్యింది. ఈ నెలఖారులోగా లక్షన్నర, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. రుణమాఫీ పథకం ప్రారంభం అనంతరం రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అటు.. గాంధీ భవన్ లో సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, అధికార ప్రతినిధులు, తదితరులు సంబరాల్లో పాల్గొన్నారు. నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అటు సచివాలయం మీడియా పాయింట్ ముందు రైతు రుణమాఫీ సంబరాలు జరుగుతున్నాయి.

పూర్తి వివరాలు..