Vishnu Vishal : క‌మెడియ‌న్‌తో వివాదం.. స్పందించిన హీరో.. రూ.2.7 కోట్లు తిరిగి ఇవ్వ‌లేనా..?

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌ (Vishnu Vishal), క‌మెడియ‌న్ సూరి (Soori) ల మ‌ధ్య గ‌త కొన్నాళ్లుగా ఓ వివాదం నెల‌కొని ఉంది. ఇన్నాళ్లు ఆ వివాదం పై స్పందించని విష్ణు విశాల్ ఎట్ట‌కేల‌కు పెద‌వి విప్పాడు.

Vishnu Vishal : క‌మెడియ‌న్‌తో వివాదం.. స్పందించిన హీరో.. రూ.2.7 కోట్లు తిరిగి ఇవ్వ‌లేనా..?

Vishnu Vishal- Soori

Vishnu Vishal- Soori : కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌ (Vishnu Vishal), క‌మెడియ‌న్ సూరి (Soori) ల మ‌ధ్య గ‌త కొన్నాళ్లుగా ఓ వివాదం నెల‌కొని ఉంది. ఇన్నాళ్లు ఆ వివాదం పై స్పందించని విష్ణు విశాల్ ఎట్ట‌కేల‌కు పెద‌వి విప్పాడు. త‌న త‌ప్పిదం ఉంటే డ‌బ్బును మొత్తం వెన‌క్కి ఇచ్చేసే వాడినంటూ చెప్పుకొచ్చాడు.

విష్ణు విశాల్‌, సూరి ల మ‌ధ్య ఉన్న వివాదం ఏంటంటే..?

విష్ణు విశాల్ తండ్రి రమేష్, నిర్మాత అన్బువేల్ రాజన్ లు ల్యాండ్ డీల్ విష‌యంలో త‌న‌ను రూ. 2.7 కోట్ల మేర మోసం చేశారంటూ 2020లో సూరి కేసు పెట్టారు. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. ఇన్నాళ్లు దీనిపై మాట్లాడ‌ని విష్ణు విశాల్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించాడు. తాను సోష‌ల్ మీడియాలో ఎలాంటి పాజిటివ్ పోస్ట్‌లు పెట్టినా.. సూరి డ‌బ్బ‌ను తిరిగి ఇచ్చేయాలి అనే కామెంట్లు ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్లు విష్ణు చెప్పారు.

Project K : ప్రాజెక్ట్‌ K ‘మిస్టరీ’ పై ప్ర‌భాస్ ట్వీట్

రోజు రోజుకు ఇవి ఎక్కువ అవుతున్నాయి. వీటిని చూస్తుంటే కోపం వ‌స్తోంది. మా వైపు త‌ప్పు గ‌నుక ఉంటే రూ.2.7 కోట్లు ఇవ్వ‌డం పెద్ద విష‌య‌మేమీ కాదు. డ‌బ్బులు ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవ‌డం త‌న‌కు ఇష్ట‌మేన‌న్నాడు. అయితే.. త‌ప్పు త‌మ వైపు లేదన్నాడు. సూరి పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వ‌చ్చాడు. నేను ఓ పోలీస్ అధికారి కుమారుడిని కావ‌డంతో మేమే అత‌డిని మోసం చేశామ‌ని, త‌ప్పు నాదే అన్న‌ట్లు కొంత మంది ఊహించుకుంటున్నారు.

ప్రజలు మొదట ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎల్లప్పుడూ సరైనదని భావిస్తారు. నేను కష్టపడలేదని, అంతా బంగారు పళ్లెంలో పెట్టారని వారు అనుకుంటారు. అది నిజం కాదు.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవ‌డానికి ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాను. అవి త‌న‌కు మాత్ర‌మే తెలుసున‌ని విష్ణు చెప్పారు. కేసు ప్ర‌స్తుతం కోర్టులో ఉంద‌ని, న్యాయం గెలుస్తుంద‌ని అన్నారు.

Hari Hara Veera Mallu : హరిహ‌ర వీరమ‌ల్లు ఫోటో లీక్ చేసిన ప‌వ‌న్‌..! థాంక్స్ చెప్పిన నిధి అగ‌ర్వాల్‌

గ‌తంలో విష్ణు విశాల్‌, సూరి మంచి స్నేహితులు. వీరిద్ద‌రు 7 సినిమాల్లో క‌లిసి ప‌ని చేశారు. ఇక విష్ణు విశాల్ ప్ర‌స్తుతం ‘లాల్ స‌లామ్’ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ద‌ర్శ‌కురాలు. జీవిత రాజశేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇటీవ‌ల ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా పూరైంది. ఈ సినిమాకి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.