IND-A vs PAK-A : దంచికొట్టిన పాకిస్తాన్ బ్యాట‌ర్లు.. భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం

ఎమ‌ర్జింగ్ ఆసియా క‌ప్ లో భాగంగా కొలొంబో వేదిక‌గా పాకిస్తాన్-ఏ, భార‌త్-ఏ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతోంది. యువ భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం నిలిచింది.

IND-A vs PAK-A : దంచికొట్టిన పాకిస్తాన్ బ్యాట‌ర్లు.. భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం

IND-A vs PAK-A

IND-A vs PAK-A : ఎమ‌ర్జింగ్ ఆసియా క‌ప్ లో భాగంగా కొలొంబో వేదిక‌గా పాకిస్తాన్-ఏ, భార‌త్-ఏ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతోంది. పాకిస్తాన్ బ్యాట‌ర్లు స‌త్తా చాటారు. ఫ‌లితంగా యువ భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 352 ప‌రుగులు చేసింది. త‌య్య‌బ్ తాహిర్ (108; 72 బంతుల్లో 12ఫోర్లు, 4 సిక్స‌ర్లు) శ‌త‌కంతో విరుచుకుప‌డ్డాడు. భారత బౌలర్లలో హంగార్గేకర్‌, రియాన్‌ పరాగ్ చెరో రెండు వికెట్లు తీయ‌గా హర్షిత్‌ రాణా, మానవ్‌ సుతార్‌, నిషాంత్‌ సింధు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Aiden Markram : ప్రియురాలిని పెళ్లాడిన స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్.. అత్త బాగుందంటూ..!

టాస్ ఓడిన పాకిస్తాన్‌కు ఆ జ‌ట్టు ఓపెనర్లు సైమ్‌ అయూబ్‌ (59; 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (65; 62 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) లు మొద‌టి వికెట్‌కు 121 ప‌రుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. అర్ధ‌శ‌త‌కాలు సాధించి ప్ర‌మాద‌క‌రంగా మారిన ఈ జోడిని మాన‌వ్ స‌తారు విడ‌దీశాడు. ఆయుబ్ భారీ షాట్‌కు య‌త్నించి య‌శ్ ధుల్ చేతికి చిక్కాడు. రెండో డౌన్‌లో వ‌చ్చిన త‌య్య‌బ్ తాహిర్ విధ్వంసం సృష్టించాడు.

IND-W Vs BAN-W : ఒత్తిడిలో భార‌త్ చిత్తు.. 9 ప‌రుగుల‌కే 4 వికెట్లు.. మూడో వ‌న్డే టై.. సిరీస్ స‌మం

ఓ వైపు విక‌ట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ ధాటిగా బ్యాటింగ్ కొన‌సాగించాడు. బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డాడు. 313 ప‌రుగుల వ‌ద్ద హంగార్గేక‌ర్ బౌలింగ్‌లో 44.5వ బంతికి భారీ షాట్‌కు య‌త్నంచగా అభిషేక్ శ‌ర్మ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. మిగిలిన వారు త‌లా ఓ చేయి వేయ‌డంతో పాకిస్తాన్ భారీ స్కోరు సాధించింది. మిగిలిన వారిలో ఒమైర్‌ యూసఫ్‌ (35), ముబాసిర్‌ ఖాన్‌ (35) లు రాణించారు. ఖాసిం అక్రమ్‌ (0), కెప్టెన్‌ మహ్మద్‌ హరీస్‌ (2), మెహ్రన్‌ ముంతాజ్‌ (13) లు విఫ‌లం అయ్యారు. ఎక్స్‌ట్రాల రూపంలో 14 ప‌రుగులు రావ‌డం గ‌మ‌నార్హం.