Team India: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇండియాను దాటేసిన పాకిస్థాన్ .. భారత్ ఏ స్థానంలో ఉందంటే?

పాకిస్థాన్, టీమిండియా తరువాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (54.17శాతం) మూడో స్థానంలో, ఇంగ్లాండ్ జట్టు ( 29.17శాతం) నాలుగో స్థానంలో నిలిచాయి.

Team India: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇండియాను దాటేసిన పాకిస్థాన్ .. భారత్ ఏ స్థానంలో ఉందంటే?

Team india

WTC Points Table : వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మధ్య రెండో టెస్టు డ్రా అయింది. వర్షం కారణంగా మ్యాచ్ డ్రా కావటంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (2023 -2025) పాయింట్ల పట్టికలో భారత్ వెనుకబడిపోయింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్న టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. రెండో టెస్టు చివరిరోజు ఆట వర్షం కారణంగా రద్దయింది. కనీసం బాల్ వేసే అవకాశం లేకుండా భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను డ్రా చేస్తూ అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ జరిగి ఉంటే టీమిండియా విజయం సాధించే అవకాశం ఉండేది. అలా జరిగిఉంటే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో నిలిచేది. మ్యాచ్ డ్రా కావడంతో టీమిండియా రెండో స్థానంలోకి వెళ్లిపోయింది.

India vs West Indies 2nd Test: టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. సిరీస్ కైవసం

ఇండియా, వెస్టిండీస్ రెండో టెస్టు అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక విడుదలయింది. ఈ జాబితాలో పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. శ్రీలంకతో తొలి టెస్టులో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. దీంతో 12 పాయింట్లు సాధించి 100 పర్సంటేజీతో పాయింట్ల పట్టికలో పాక్ ముందు వరుసలో నిలిచింది. పాయింట్ల విషయానికి వస్తే.. భారత్ జట్టుకు 16 పాయింట్లు ఉన్నాయి. పాకిస్థాన్ జట్టుకు 12 పాయింట్లు ఉన్నాయి. అయితే, పర్సంటేజీ విషయానికివస్తే పాకిస్థాన్ 100 శాతం, టీమిండియా 66.67శాతం మాత్రమే కలిగి ఉంది. దీంతో పాకిస్థాన్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

100 rupees note : కొత్త రూ.100 నోటు వెనుకున్న ఈ బొమ్మ గురించి తెలుసా..? ఈ అద్భుత నిర్మాణం వెనుక ఓ రాణి

పాకిస్థాన్, టీమిండియా తరువాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (54.16శాతం) మూడో స్థానంలో, ఇంగ్లాండ్ జట్టు ( 29.16శాతం) నాలుగో స్థానంలో నిలిచాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు యాషెష్ టెస్టు సిరీస్‌లో తలపడుతున్నాయి. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఆసీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టు జూలై 27న లండన్ వేదికగా జరగనుంది. వెస్టిండీస్ జట్టు ఇండియాతో మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంతో నాలుగు పాయింట్లు సాధించి 16.67శాతంతో కొనసాగుతోంది.

WTC Points Table

WTC Points Table