Assam: ఫేస్‌బుక్ ప్రేమ.. మూడేళ్ల తరువాత భార్య, ఆమె తల్లిదండ్రులను హత్యచేసిన భర్త .. అసలేం జరిగిందంటే?

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో 2020లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో 25ఏళ్ల నజీబుర్ రెహమాన్ బోరా, 24ఏళ్ల సంఘమిత్ర ఘోష్ మధ్య ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.

Assam: ఫేస్‌బుక్ ప్రేమ.. మూడేళ్ల తరువాత భార్య, ఆమె తల్లిదండ్రులను హత్యచేసిన భర్త .. అసలేం జరిగిందంటే?

Nazibur and Sanghamitra

Man Kills Wife: కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఫేస్‌బుక్ ద్వారా ఒకరినొకరు పరిచయం అయ్యారు. ఇంట్లో వారికి తెలియకుండా వెళ్లిపోయారు. ఆ తరువాత యువతి తల్లిదండ్రులు వెతికి తీసుకొచ్చారు. మళ్లీ ప్రియుడితో వెళ్లిపోయి యువతి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వారికి తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు. అయితే, తాజాగా భర్త దారుణానికి పాల్పడ్డాడు. యువతితో సహా, ఆమె తల్లిదండ్రులను హత్య చేశాడు. తొమ్మి నెలల కొడుకును తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Crime News: దళితుడితో చెప్పులు నాకించిన వ్యక్తి.. ఆ తర్వాత..

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో 2020లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో 25ఏళ్ల నజీబుర్ రెహమాన్ బోరా, 24ఏళ్ల సంఘమిత్ర ఘోష్ మధ్య ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారి పరిచయంకాస్త ప్రేమగా మారింది. నజీబుర్ మెకానికల్ ఇంజనీర్. నెలరోజుల తరువాత నజీబుర్ రెహమాన్ బోరా, సంఘమిత్ర ఘోష్ ఇద్దరూ కోల్‌కతాకు పారిపోయారు. సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను వెతికి పట్టుకొని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే కోల్‌కతా కోర్టులో నజీబర్‌ను వివాహం చేసుకుంది. మరుసటి సంవత్సరం సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెపై దొంగతనం అభియోగం మోపారు. పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆమెను అరెస్టు చేసి నెలరోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. బెయిల్ పొందిన తరువాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిందని పోలీసులు తెలిపారు.

Woman Love with Phone Thief : తన ఫోన్ చోరీ చేసిన దొంగతో యువతి ప్రేమాయణం .. వీరి లవ్వు స్టోరీ మామూలుగా లేదుగా..

2022 జనవరిలో సంఘమిత్ర, నజీబుర్ మళ్లీ ఇంటినుంచి వెళ్లిపోయారు. ఈసారి వారు ఐదు నెలలు చెన్నైకి వెళ్లి నివాసం ఉన్నారు. ఈ దంపతులు ఆగస్టులో గోలాఘాట్ కు తిరిగి వచ్చేసరికి సంఘమిత్ర గర్భవతి. ఆ తరువాత వారిద్దరూ నజీబుర్ ఇంట్లో నే ఉన్నారు. గత ఏడాది నవంబర్ నెలలో వీరికి ఒక కుమారుడు జన్మించారు. అయితే, కుమారుడు జన్మించిన నాలుగు నెలల తరువాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఈ ఏడాది మార్చిలో సంఘమిత్ర తన కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్లింది. నజీబుర్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు.. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. హత్నాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 28రోజులు తరువాత బెయిల్ పై నజీబుర్ బయటకు వచ్చాడు.

Peddapally : పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం

జైలు నుంచి వచ్చిన తరువాత నజీబుర్ తన బిడ్డను చూసేందుకు భార్య ఇంటికి వెళ్లాడు. కానీ, నజీబుర్‌ను భార్య, ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కుమారుడిని చూసేందుకు వీలులేదని చెప్పారు. ఈ క్రమంలో ఏప్రిల్ 29న భార్య, ఆమె కుటుంబ సభ్యులు నజీబుర్ పై దాడి చేశారని, నజీబుర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదం నడుస్తున్న క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం మరోసారి నజీబుర్ కు భార్య, ఆమె కుటుంబ సభ్యులతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణ సమయంలో నజీబుర్ తన భార్య సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రులను హత్య చేశాడు. ఆ తరువాత తన తొమ్మిదినెలల కొడుకుతో అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు తొమ్మిది నెలల కుమారుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.