ఎంపీడీవో మిస్సింగ్ మిస్టరీ.. 4 రోజులైనా లభించని ఆచూకీ, అసలేమయ్యారు?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం.. మిస్సింగ్ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు. సంబంధిత అధికారులు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఎంపీడీవో మిస్సింగ్ మిస్టరీ.. 4 రోజులైనా లభించని ఆచూకీ, అసలేమయ్యారు?

Narsapuram Mpdo Missing Case : అదృశ్యమైన.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఆచూకీ కోసం నాలుగు రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎంపీడీవో వెంకటరమణ జాడ కోసం రంగంలోకి దిగిన 16 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. నలుగురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు సహా 150 మంది సిబ్బంది.. ఎంపీడీవో కోసం అన్వేషిస్తున్నారు.

కృష్ణా జిల్లా మహదేవపురంలో నివాసం ఉండే ఎంపీడీవో వెంకటరమణ ఈ నెల 15న ఉదయం 11 గంటలకు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లారు. తాను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భార్యతో చెప్పి వెళ్లారాయన. తనకు ఉద్యోగ పరంగా ఇబ్బందులు ఉన్నాయని, అదే రోజు అర్థరాత్రి తన చిన్నకొడుకు వాట్సాప్ కి తాను రాసిన లెటర్ షేర్ చేశారు ఎంపీడీవో. మేసేజ్ చూసిన చిన్నకొడుకు తెల్లవారుజామున 3 గంటలకు పెనమలూరు పోలీస్ స్టేషన్ లో తండ్రి మిస్సింగ్ పై ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుతో అలర్ట్ అయిన పెనమలూరు పోలీసులు ఒక బృందాన్ని మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు పంపి గాలింపు చర్యలు చేపట్టారు. వెంకటరమణ విజయవాడ వెళ్లేందుకు 2 గంటల 30 నిమిషాలకు టికెట్ తీసుకున్న సీసీ ఫుటేజీని అధికారులు గుర్తించారు. దాని ఆధారంగా ప్రతి రైల్వే స్టేషన్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఒకవైపు సీసీ కెమెరాల పర్యవేక్షణ, మరోవైపు ఎంపీడీవో కాల్ డిటైల్స్, గూగుల్ మ్యాపింగ్ డేటా సాయంతో మధురానగర్ వద్ద దిగి అక్కడే సంచరించినట్లు గుర్తించారు. చివరగా ఎంపీడీవో రెండో ఫోన్ 15, 16న మధ్య రాత్రిలో చివరి యాక్టివిటీని ఏలూరు కాలువ దగ్గర గుర్తించారు.

ఒకవేళ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారా? అనే అనుమానంతో ఏలూరు కాలువ చుట్టుపక్కల ప్రాంతాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో గాలించారు. అయినా, ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ లభించ లేదు. ఎంపీడీవో వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. బాధిత కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించి అదృశ్యం వెనుక కారణాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం.. మిస్సింగ్ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు. సంబంధిత అధికారులు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కాలువలో వెతుకులాడే ప్రక్రియకు ఇబ్బంది ఎదురవుతోందని జిల్లా ఎస్పీ. ఎంపీడీవో అదృశ్యం వెనుక నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కచ్చితంగా శిక్షిస్తామన్నారు ఎస్పీ.

Also Read : నామినేటెడ్‌ పదవులు దక్కేది వీరికే? పదవుల భర్తీకి సీఎం చంద్రబాబు సరికొత్త పంథా