iPhone 14 Save Man Life : 400 అడుగుల లోయలో పడిన కారు.. తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తి ప్రాణాన్ని ఆపిల్ ఐఫోన్ 14 ఎలా కాపాడిందో తెలుసా?

iPhone 14 Save Man Life : లాస్ ఏంజిల్స్ సమీపంలో ఘోర కారు ప్రమాదం జరిగింది. లోయ మీదుగా దూసుకుపోతున్న కారు ప్రమాదవశాత్తూ 400 అడుగుల లోతున్న లోయలో పడింది. ఆపిల్ ఐఫోన్ 14 కారులో వ్యక్తిని ప్రాణాలతో కాపాడింది.

iPhone 14 Save Man Life : 400 అడుగుల లోయలో పడిన కారు.. తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తి ప్రాణాన్ని ఆపిల్ ఐఫోన్ 14 ఎలా కాపాడిందో తెలుసా?

Apple iPhone 14 saves man after his car falls into 400 feet deep gorge

iPhone 14 Save Man Life : లాస్ ఏంజెల్స్ సమీపంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలను ఆపిల్ ఐఫోన్ కాపాడింది. ఐఫోన్ 14 ప్రత్యేక ఫీచర్ల సాయంతో ఆ వ్యక్తి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు తన కారును ఒక కొండపై నుంచి నడిపాడు.

మౌంట్ విల్సన్ ప్రాంతంలోని 400 అడుగుల లోతైన లోయలో కారుతో సహా పడిపోయాడు. అదృష్టవశాత్తూ.. అతని ఐఫోన్ 14 లోని రెండు ముఖ్యమైన ఫీచర్లు అతని రక్షించాయి. శాటిలైట్ ద్వారా క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS ఫీచర్లు యాక్టివేట్ అయి.. ఎలా అతన్ని రక్షించాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా.. ఆపిల్ ఐఫోన్ 14 ఆటోమేటిక్‌గా తీవ్రమైన కారు ప్రమాదం సంభవించిందని గ్రహించింది. కారులోని వ్యక్తికి వీలైనంత త్వరగా సాయం అందించింది.

Read Also : Amazon Great Freedom Sale : ఆగస్టు 5 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు..!

రెండవది.. ఐఫోన్ శాటిలైట్ కనెక్షన్‌ని ఉపయోగించి అత్యవసర రిలే సెంటర్‌కు టెక్స్ట్ మెసేజ్ పంపింది. కారు క్రాష్ అయిన ప్రదేశంలో సెల్యులార్ లేదా Wi-Fi కవరేజీ లేదు. కానీ, శాటిలైట్ కనెక్షన్ సాయంతో మెసేజ్ పంపిందని MacRumours నివేదిక తెలిపింది. టెక్స్ట్ మెసేజ్ ప్రమాదం జరిగిన కచ్చితమైన లొకేషన్ అందించింది. ఈ కచ్చితమైన లొకేషన్ సమాచారం సాయంతో రెస్క్యూ టీం లోయలో ఉన్న వ్యక్తిని గుర్తించారు. దాదాపు 400 అడుగుల లోతులో ఇరుక్కుపోయి అతడు బయటకు వచ్చేందుకు మార్గం లేకుండా పోయింది.

Apple iPhone 14 saves man after his car falls into 400 feet deep gorge

iPhone 14 Save Man Life : Apple iPhone 14 saves man after his car falls into 400 feet deep gorge

ఐఫోన్ సాయం లేకుండా మనిషిని కనుగొనడం సవాలుగా ఉండేదని మాంట్రోస్ సెర్చ్ అండ్ రెస్క్యూ నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లో ఒకరైన స్టీవ్ గోల్డ్‌స్వర్తీ అభిప్రాయపడ్డారు. రిమోట్ లొకేషన్ ద్వారా అతన్ని గుర్తించామన్నారు. బాధిత వ్యక్తి 400 అడుగుల లోతులో ఉన్న ఒక లోయలో పడి ఉండటాన్ని గుర్తించామని స్టీవ్ గోల్డ్స్‌వర్తీ అనే వ్యక్తి చెప్పారు. ఆ వ్యక్తిని సకాలంలో రక్షించకపోతే తీవ్రరక్తస్రావం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

రెస్క్యూ టీంలోని మరో సభ్యుడు మాట్లాడుతూ.. ఆ వ్యక్తికి గాయాలు తీవ్రంగా ఉన్నాయని, అతన్ని సకాలంలో రక్షించకపోతే బతికేవాడు కాదని పేర్కొన్నాడు. అన్ని ఐఫోన్ 14 మోడళ్లలో క్రాష్ డిటెక్షన్ డిఫాల్ట్ ఫీచర్‌గా వస్తుందని గమనించాలి. శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS విషయానికొస్తే.. iOS 16.1 అప్‌డేట్ లేదా తర్వాతి వెర్షన్‌ ఐఫోన్ 14లో మాత్రమే పనిచేస్తుంది.

మన స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఇలాంటి లైఫ్-సేవింగ్ టెక్నాలజీ తప్పక ఉండాలని ప్రమాద ఘటన గుర్తు చేస్తుంది. సాంప్రదాయిక కమ్యూనికేషన్ పద్ధతులు అందుబాటులో లేనప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో చాలామంది జీవితాలను ఇలాంటి ఫీచర్లు కాపాడగలవు. ప్రమాదం నుంచి బయపడిన అనంతరం బాధిత వ్యక్తి ఐఫోన్ 14 ఎమర్జెన్సీ ఫీచర్ల సాయంతోనే తాను ప్రాణాలను బయటపడినట్టు తెలుసుకుని చాలా సంతోషించాడు.

Read Also : Apple iPhone 15 Series : ఆపిల్ బిగ్ లాంచ్ ఈవెంట్‌కు ముందే ఐఫోన్ 15 సిరీస్ ధరలు లీక్.. ఏ ఐఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?