Oath on Bhagavad Gita : కోర్టులో నిజంగా భగవద్గీతపై ప్రమాణం చేయిస్తారా?

'అంతా నిజమే చెబుతాను.. అబద్ధం చెప్పను..' అంటూ సాక్షులతో భగవద్గీత మీద ప్రమాణం చేయించే సీన్స్‌ని చాలా సినిమాల్లో చూసాం. ఒకప్పుడు మత గ్రంథాలపై ప్రమాణాలు చేయించే సంప్రదాయం ఉన్నప్పటికీ.. ఇప్పటి చట్టం ప్రకారం భగవద్గీత మీద ప్రమాణం చేయించడం అనే కేవలం అపోహ మాత్రమేనట.

Oath on  Bhagavad Gita : కోర్టులో నిజంగా భగవద్గీతపై ప్రమాణం చేయిస్తారా?

Oath on Bhagavad Gita

Oath on Bhagavad Gita : చాలా సినిమాల్లో కోర్టు సీన్స్‌లో చూస్తుంటాం.. అంతా నిజమే చెప్తాను.. అంటూ భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. నిజంగానే ఇలాంటి సంప్రదాయం భారతీయ న్యాయస్ధానాలలో ఉందా?

Oppenheimer : శృంగార స‌న్నివేశంలో భగవద్గీత.. మండిప‌డుతున్న భార‌తీయులు.. తొల‌గించ‌క‌పోతే ఊరుకోం

ఇండియన్ కోర్టుల్లో ప్రమాణం చేయడానికి భగవద్గీతను ఉపయోగిస్తారనేది ఒక అపోహగా చెబుతారు. కేవలం సినిమాల్లో మాత్రమే అలా చూపించారని అంటారు. సాక్ష్యం చెప్పడానికి ముందు గీత లేదా మరేదైనా పవిత్ర గ్రంథం ద్వారా సాక్షులు ప్రమాణం చేసే పద్ధతిని కోర్టులు తొలగించాయి. మత గ్రంథాలపై ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పడం అనేది మొఘలుల కాలంలో ఉండేదట. హిందువులు గంగా నది మీద, భగవద్గీత మీద ప్రమాణం చేస్తే ముస్లింలు ఖురాన్ మీద ప్రమాణం చేసేవారట. ఈ సంప్రదాయాలు బ్రిటిష్ కాలంలో కూడా కొనసాగింది.

 

హిందువులు, ముస్లిమేతరులు తమ మతంలోని మతపరమైన గ్రంథాలపై ప్రమాణం చేసే ఆచారం 1969 తో ముగిసింది. లా కమిషన్ తన 28 వ నివేదికలో భారతీయ ప్రమాణాల చట్టం ప్రకారం ఒకటే చట్టం ఆమోదించబడింది. దేశమంతటా ప్రమాణం చేయడానికి ఒకే ఒక విధాన్ని ప్రవేశ పెట్టారు. 1969 చట్టం ప్రకారం నిర్దిష్టంగా ఏ మతపరమైన వర్గాన్ని సూచించకుండా ప్రమాణం చేయవచ్చు. ‘నేను దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను/నేను చెప్పేది సత్యం, పూర్తి సత్యం నిజం తప్ప మరేమీ కాదని ధృవీకరిస్తున్నాను’ ఫార్మాట్ సూచించబడింది.

Bhagavad Gita : ఆ పాత్రని అర్ధం చేసుకోవడం కోసం భగవద్గీత చదివాను.. హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ!

ఇక 12 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరూ ప్రమాణం చేయాల్సిన అవసరం లేదట. 1952 లో ప్రారంభించబడిన సుప్రీంకోర్టు భవనంపై  సంస్కృత శాసనంలో మాత్రమే భగవద్గీత గుర్తుగా కనిపిస్తుంది. ఇప్పుడు కోర్టు లోపల రాజ్యాంగం మాత్రమే పవిత్ర గ్రంథంగా భావించబడుతోంది.