Janasena Leader Pothina Mahesh: జగన్‌పై వెబ్ సిరీస్.. తెల్ల జుట్టు ఉన్నా పర్లేదు.. వైసీపీలో నటులు కూడా ట్రై చేయొచ్చు..

జగన్‌పై సినిమా తీయలనే ఆలోచన వొచ్చింది. కానీ, బడ్జెట్ లేదు. ఒక వెబ్ సీరీస్ ప్లాన్ చేశాను అని పోతిన మహేష్ అన్నారు.

Janasena Leader Pothina Mahesh: జగన్‌పై వెబ్ సిరీస్.. తెల్ల జుట్టు ఉన్నా పర్లేదు.. వైసీపీలో నటులు కూడా ట్రై చేయొచ్చు..

Janasena Leader Pothina Mahesh

Pothina Mahesh: వైసీపీ నాయకులకు, మంత్రులకు, సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి పవన్ ఫోబియో పట్టుకుంది. పవన్ కళ్యాణ్ పేరు విన్నా, ఫొటోచూసినా వణికిపోతున్నారు అంటూ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేటాయించిన శాఖల మీద మాట్లాకుండా పవన్‌పై మాత్రమే వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. పవన్ వల్ల ఓడిపోతామనే భయం వైసీపీ నేతలకు పట్టుకుంది అంటూ ఎద్దేవా చేశారు. బ్రో సినిమా‌పై నిర్మాతలు, డైరెక్టర్‌లు మాట్లాడతారు.. మంత్రులు ఎందుకు మాట్లాడడం అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు. వైసీపీ నుండి, మంత్రుల పదవులకు రాజీనామాచేసి సినిమా మ్యాగజైన్ నడుపుకోండి. రివ్యూలు రాసుకోండి అంటూ సూచించారు.

Bro Movie : పవన్ రెమ్యునరేషన్, బ్రో బడ్జెట్ పై వస్తున్న విమర్శలకు నిర్మాత గట్టి కౌంటర్.. 

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం, ప్రత్యేక హోదా, పోలవరం, ఇతర ప్రజా సమస్యల‌పై బహిరంగ సవాల్ విసురుతున్నాం. చర్చకు రావాలని వైసీపీ నేతలకు పిలుపునిస్తున్నాం అని పోతిన మహేష్ అన్నారు. గోదావరి జిల్లాలో వారాహి యాత్రలో నిమ్మకాయలు నలిగిపోయినట్లు, నలిగిపోతారు. పవన్ పై అమ్మవారి ఆశీసులు ఉన్నాయి. జగన్ పై, వైసీపీ నేతలపై లేవు. బ్లాక్ మనీని వైట్ మనీ చేయడంలో జగన్ మోహన్ రెడ్డి దిట్ట. నిమ్మగడ్డ ఎవరు పాట్నర్? విదేశాల్లో జైలు జీవితం గడిపారు.

Ambati Rambabu : పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా

జగన్‌పై సినిమా తీయలనే ఆలోచన వొచ్చింది. కానీ, బడ్జెట్ లేదు. ఒక వెబ్ సీరీస్ ప్లాన్ చేశాను అని పోతిన మహేష్ అన్నారు. తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093, డాక్టర్ ఆఫ్ వివేక, గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసుక దిబ్బలు, కోడి కత్తి సమేత శ్రీను, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అదే ఇల్లు, ఒక ఖైదీ వదిలిన బాణం అంటూ పేర్లు ఆలోచిస్తున్నాం. వైసీపీ‌లో ఉన్న నటులుకూడా ట్రై చేసుకోవొచ్చు. తెల్ల జుట్టు ఉందని ఏం పక్కన పెట్టం. ఏఒక్క విషయం విస్మరించం. అన్ని వాస్తవాలు వివరిస్తాం. బయట డైరెక్టర్‌ని పెట్టి వెబ్ సిరీస్ తెస్తాం అని పోతినేని హేష్ చెప్పారు.