Pro Panja League: హైదరాబాద్‌కు మళ్లీ నిరాశే.. ఇక ఇంతేనా?

తొలి రెండు మ్యాచుల్లో కిరాక్‌ హైదరాబాద్‌ అండర్‌ కార్డ్‌లల్లో ఆశించిన ప్రదర్శన చేయలేదు.

Pro Panja League: హైదరాబాద్‌కు మళ్లీ నిరాశే.. ఇక ఇంతేనా?

Pro Panja League

Pro Panja League – Kiraak Hyderabad: ప్రొ పంజా లీగ్‌ (ఆర్మ్‌ రెజ్లింగ్‌)లో కిరాక్‌ హైదరాబాద్‌ తడబడింది. న్యూఢిల్లీ(New Delhi)లోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో రోహతక్‌ రౌడీస్‌ (Rohtak Rowdies) చేతిలో కిరాక్‌ హైదరాబాద్‌ 7-16తో పోరాడి ఓడింది.

Pro Panja League


Pro Panja League

రోహతక్‌ రౌడీస్‌తో మ్యాచ్‌లో అటు అండర్‌ కార్డ్‌, ఇటు మెయిన్‌ కార్డ్‌ మ్యాచుల్లో కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లు ఉడుం పట్టుతో ఆకట్టుకున్నప్పటికీ.. ప్రొ పంజా లీగ్‌ తొలి సీజన్లో రెండో పరాజయం తప్పలేదు. గత మ్యాచ్‌లో బరోడా బాద్‌షాస్‌పై కిరాక్‌ హైదరాబాద్‌ ఏకపక్ష సాధించిన సంగతి తెలిసిందే. గ్రూప్‌ దశలో తర్వాతి మ్యాచ్‌లో నేడు కోచి కెడిస్‌తో కిరాక్‌ హైదరాబాద్‌ పోటీపడనుంది.

Pro Panja League


Pro Panja League

తొలి రెండు మ్యాచుల్లో కిరాక్‌ హైదరాబాద్‌ అండర్‌ కార్డ్‌లల్లో ఆశించిన ప్రదర్శన చేయలేదు. కానీ రోహతక్‌ రౌడీస్‌తో మ్యాచ్‌లో అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లోనూ కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లు ఆకట్టుకున్నారు. 80 కేజీల విభాగంలో ఖాజీ అబ్దుల్‌ మజీద్‌ 0-1తో మనోజ్‌ కుమార్‌ దాస్‌ చేతిలో ఓటమిపాలై నిరాశపరిచినా…90 కేజీల విభాగంలో సిద్దార్థ్‌ మలాకర్‌ 1-0తో పరంజిత్ నగార్‌పై పైచేయి సాధించాడు.

Pro Panja League


Pro Panja League

మహిళల 55 కేజీల విభాగంలో సవితా కుమారి 1-0తో శివాని భట్నానగర్‌ను చిత్తు చేసింది. దీంతో అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లోకిరాక్‌ హైదరాబాద్‌ 2-1తో ఆధిపత్యం చూపించింది. ఇక మెయిన్‌ కార్డ్‌లోనూ కిరాక్‌ హైదరాబాద్‌కు తొలి మ్యాచ్‌లో నిరాశే ఎదురైంది. మెన్న్‌ 100 కేజీల విభాగంలో జగదీశ్‌ బారు 0-5తో ధారా సింగ్‌ హడా చేతిలో పోరాడి ఓడాడు. ఐదు పట్టుల్లోనూ జగదీశ్‌ బారు నిరాశపరిచాడు.

Pro Panja League


Pro Panja League

మెన్ 60 కేజీల విభాగంలో యాజిర్‌ అరాఫత్‌ కిరాక్‌ హైదరాబాద్‌కు జోశ్‌ తీసుకొచ్చాడు. నిఖిల్‌ సింగ్‌పై 5-0తో ఎదురులేని ఆధిపత్యం చెలాయించిన యాజిర్‌ మ్యాచ్‌లో ఉత్కంఠను మరింత పెంచాడు. మ్యాచ్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌ మహిళల 65 కేజీల విభాగం ఆర్మ్‌ ఫైట్‌.

కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్‌ జిన్సీ జోశ్‌ అంచనాలను అందుకోలేదు. హోరాహోరీగా సాగిన ఈ ఆర్మ్‌ ఫైట్‌లో రోహతక్‌ రౌడీస్‌ ప్లేయర్‌ నిర్మలా దేవి ఏకంగా 10-0తో జిన్సీ జోశ్‌పై విజయం సాధించింది. దీంతో 16-13తో కిరాక్‌ హైదరాబాద్‌ఫై రోహతక్‌ రౌడీస్‌ పైచేయి సాధించింది.

KL Rahul : టీమిండియా అభిమానులకు శుభవార్త.. కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు ..