Most Dangerous Tree : ఈ చెట్టును ముట్టుకుంటే ప్రాణాలే పోతాయ్ .. చెట్టు ఆకులు, బెరడు, పండ్లు అంతే విషమే

ప్రాణాలు తీసే చెట్టు. ఆకులు, కాయలు అంతా విషమే. మనుషులకేకాదు జంతువులకు, పక్షలకు కూడా ప్రమాదమే. ప్రాణం లేని వాహనాలకు కూడా ఈ చెట్టు వల్ల ప్రమాదమే. ఆ చెట్టు నీడ పడినా ప్రాణాలకే ప్రమాదం..అత్యంత ప్రమాదకరమైన ఈ చెట్టు గురించి షాకింగ్ విషయాలు..

Most Dangerous Tree : ఈ చెట్టును ముట్టుకుంటే ప్రాణాలే పోతాయ్ .. చెట్టు ఆకులు, బెరడు, పండ్లు అంతే విషమే

world most toxic trees Manchineel Tree

Manchineel Tree : చెట్లు మనిషికే కాదు సమస్త కోటి జీవరాశికి ఆక్సిజన్ ను ఇస్తాయి. నీడినిస్తాయి. పండ్లు,పూలు ఇస్తాయి. గృహ నిర్మాణాలకు కలపనిస్తాయి. వంట చెరకుగా ఉపయోగపడతాయి. చెట్ల వల్ల ఉపయోగాలు అన్నీ ఇన్నీకావు.అటువంటి చెట్లలో ప్రమాదకరమైన చెట్లు కూడా ఉన్నాయనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనిషి జీవించటానికి ఆక్సిజన్ ను ఇచ్చే చెట్లలో మనిషి ప్రాణాలు తీసే చెట్లు కూడా ఉన్నాయనే విషయం ఆశ్చర్యం కలిగించటమే కాదు ఆందోళనకు కలిగిస్తుంది. అలా మనిషి ప్రాణాలకు హాని కలిగించే ఓ రకం చెట్టు గురించి తెలుసుకుందాం…

దాని పేరు మంచినీల్ చెట్టు (Manchineel Tree) ఒకటి. చాలా చాలా ప్రమాదకరమైన చెట్టు. దట్టంగా ఆకులు ఉండే ఈ చెట్టు కింద నీడ ఉందని వెళితే ప్రాణాలు తీస్తుంది. ఆ చెట్టు ఆకులు, పండ్లు, బెరడు, కాండం అంతా విషపూరితమే. ఇక ఈ చెట్టును ముట్టుకుంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే.. ఒక మాటలో చెప్పాలంటూ నిలువెల్లా విషపూరితమైనది ఈ ‘మంచినీల్ చెట్టు.

మంచినీల్ (Manchineel Tree)అనే పేరు దీనికి స్పానిష్ (Spanish)నుంచి వచ్చింది. స్పానిష్ భాషలో మంజనీల్ల అనే పేరునుంచి ఈ పేరు వచ్చింది. ఈ చెట్లు దక్షిణ-ఉత్తర అమెరికా నుంచి ఉత్తర-దక్షిణ అమెరికా వరకూ ఉంటాయి. చెట్టు పేరు చూసి… ఇదేదో మంచినీళ్ల చెట్టులా ఉందే అనుకోవద్దు. ఈ పేరు స్పానిష్ పదమైన మంజనీల్ల నుంచి వచ్చింది. మంజనీల్ల అంటే స్పానిష్ భాషలో చిన్న యాపిల్ అని అర్థం. పేరుకు తగినట్లే ఈ చెట్టుకు కాసే కాయలు కూడా చిన్న చిన్న యాపిల్ లా ఉంటాయి. చూడగానే గ్రీన్ యాపిల్ లా కనిపిస్తాయి. ఈ చెట్ల ఆకులు కూడా యాపిల్ చెట్ల ఆకుల్లానే ఉంటాయి.

Ariana Viera: చావు గురించి వీడియో తీసుకున్న మోడల్.. యాక్సిడెంట్ రూపంలో నిజంగానే కౌగిలించుకున్న మృత్యువు

మంచినీల్ చెట్లను బీచ్ యాపిల్ అని కూడా అంటారు. ఈ చెట్టు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్ల (most toxic trees in the world)లో ఇదీ ఒకటి. ఈ ప్రకృతిలో పాలు కారే చెట్లు చాలా ఉన్నాయనే విషయం తెలిసిందే.బొప్పాయి. గన్నేరు, మర్రి ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ మంచినీల్ చెట్టు నుంచి కూడా పాలు వంటి ద్రవం కారుతుంది. ఈ పాలులాంటి ద్రవం అత్యంత విషపూరితమైనది. ఆ పాలను ముట్టుకుంటే చాలా శరీరం మంటపుడుతుందట. వెంటనే దద్దుర్లు, కురుపుల వంటివి వచ్చేస్తాయి. అలాగే ఈ చెట్టు ఆకులు, బెరడు, పండ్లు అంటూ విషపూరితమైనవే. ఆకు తుంచినా పాలు కారతాయి. కాయ తెంపినా పాలు వస్తాయి. ఆఖరికి చెట్టు కాండం నుంచి కూడా పాలులాంటి ద్రవం కారుతుంది. కాబట్టి ఈ చెట్టును ముట్టుకున్నా, దీని దగ్గరకు వెళ్లినా ప్రాణాలకే ప్రమాదం. ఈ చెట్టు నీడను కూడా నిల్చున్నా ప్రమాదమేనట..

కరీబియన్ దీవులకు చెందిన ఈ చెట్లు ఫ్లోరిడా, ది బహమాస్, మెక్సికో, మధ్య అమెరికా, ఉత్తర-దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి. సముద్ర తీరాల పక్కన కూడా కనిపిస్తాయి. మాంగ్రూవ్ చెట్ల మధ్యలో ఇవి కూడా పెరుగుతాయి. ఈ చెట్లు గాలుల తీవ్రతను తగ్గించగలవట. సముద్రపు అలలకు భూమి కోతకు గురి కాకుండా ఈ చెట్లు ఉంచుతాయి. 49 అడుగుల ఎత్తు వరకూ పెరగగలిగే ఈ చెట్లు సముద్రం వల్ల నేలపై మట్టి సముద్రంలో కలిసిపోకుండా వీటి వేర్లు నేలను బలంగా ఉంచుతాయి. ఎరుపు-బూడిదరంగు బెరడుతో ఉంటాయి. ఆకుపచ్చ, పసుపు పచ్చని రంగు పూలు పూస్తాయి. ఈ చెట్టు ఆకులు మెరుపుతో కూడిన మంచి రంగులో కనిపిస్తాయి. చూడగానే చాలా అందంగా కనిపిస్తాయి. ఇక ఈ చెట్టు పండు గ్రీన్ ఆపిల్ లా ఉందని తింటే అంతే సంగతులు ప్రాణం పోతుంది. అలా ఈ చెట్టు పండు, ఆకు, పూలు, బెరడు, కాండం అలా నిలువెల్లా విషపూరితమైనదే.

ఆఖరికి ఈ చెట్టు నీడ కూడా మనిషి ప్రాణాలకు ప్రమాదమే. నీడ కూడా ఎలా ప్రమాదం అంటారా…ఈ చెట్టు కింద కాసేపు నిలబడినా,కూర్చున్నా శరీరానికి మెల్లగా ఎలర్జీలు రావడం మొదలవుతుంది. అంటే ఆ చెట్టు ఎంతటి ప్రభావం చూపుతుందో ఊహించుకోవచ్చు. ఎలర్జీలో భాగంగా చర్మంపై దురదలు వస్తాయి. గోకితే దద్దుర్లు వచ్చి కొంతసేపటికే పుండ్లుగా మారతాయి. ఇక పొరపాటున చెట్టు పాలు మీద పడితే అంతే శరీరంపై దద్దుర్లు వచ్చేస్తాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఈ చెట్ల కింద అస్సలు వెళ్లకూడదు. దాని నీడ కూడా పడకూడదు. వర్షం పడే సమయంలో ఆ చెట్టు పాలు వర్షపు నీటితో కలిసి మీద పడ్డాయా అంతే సంగతలు. చర్మం కాలిపోయినట్లు బొబ్బలు వచ్చేస్తాయి. కందిపోతుంది, బుడగలలాగా ఉబ్బుతుంది, రక్తం కారుతుంది, విపరీతమైన నొప్పి. భరించలేనంతా మెలిపెట్టేస్తుంది.

Sunflower : సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వు వెనుక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ..!

ఈ చెట్టు మనుషులకే కాదు..జంతువులకు,పక్షులకు కూడా ప్రమాదం. సాధారణంగా ఈ చెట్లమీద పక్షులు వాటవట. జంతువులు ఆ చెట్ల కేసి పోవటం. అంటే మనిషి కంటే జంతువులు, పక్షులు చాలా తెలివైనవనే చెప్పాలి. అంతేకాదు ప్రాణం లేని వాహనాలకు కూడా ప్రమాదకారకమేనట.ఈ చెట్టు కింద ఏ పార్క్ చేసిన వాహనాలు కూడా పాడైపోతాయట. వాహనాలపై పెయింట్ పాడైపోతుందట. అంతేకాదు ఈ చెట్టుకు నిప్పు తగిలి మండిందా..ఆ చెట్టు నుంచి వచ్చే పొగ కళ్లను తాకితే గాయాలు తప్పవు…ఎర్రగా మారిపోతాయి. నీళ్లు కారతాయి. కంటిచూపు కూడా పోతుంది. చెట్టు పాలు కళ్లలో పడితే… చూపు పోయే ప్రమాదం ఉంది..

ఈ చెట్టు పండు తియ్యగా ఉంటుందట. కానీ తింటే మాత్రం కాసేపటికే నోరు అంతా మంట పుట్టి నోరంతా చీరుకుపోయినట్లుగా మారిపోయి గాయాలు అవుతాయి. రక్త వచ్చి నొప్పి విపరీతంగా ఉంటుంది.గొంతు పట్టేసి మాట రావటం కష్టమైపోతుంది. విషపూరితమైన ఈ చెట్టును ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానిక గిరిజనులు అత్యంత జాగ్రత్తలు తీసుకుని దాని విషయాన్ని ఉపయోగించుకుంటారు. పూర్వం వేట ఆధారంగానే జీవించేవారు గిరిజనులు.ఆ చెట్టు విషాన్ని తమ బాణాలకు పూసి జంతువుల్ని వేటాడేవారట.

ఇంత ప్రమాదకరమైన..విషపూరితమైన ఈ చెట్టు వల్ల ఎవరికి ఎటువంటి హాని కలుగుకుండా ఏకంగా ప్రభుత్వాలే చర్యలు తీసుకుంటున్నాయి అంటే చెట్టు ఎంతటి ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చు. కాగా.. స్పెయిన్‌కి చెందిన ఎక్స్‌ప్లోరర్ జువాన్ పోన్స్ డి లియోన్… ఫ్లోరిడాలోని… కాలూసియాలో జరిగిన యుద్ధంలో చనిపోయాడు. మంచినీల్ చెట్టు పాలను అంటించిన బాణం అతనికి గుచ్చుకుని గాయం అయి దాన్ని తాళలేకి చనిపోయాడట.

ఇంత ప్రమాదకరమైన ఈ చెట్ల జాతి కూడా అంతరించిపోతోందట. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఈ చెట్లు అంతరించిపోయే చెట్ల జాతుల్లో చేరటంతో ఈ విషపు చెట్టు జాతిని కూడా కాపాడే యత్నాలు చేస్తోందట ఫ్లోరిడా ప్రభుత్వం. ఈ చెట్లు ఉన్న ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులను కూడా ఏర్పాటు చేస్తారు ఆయా ప్రాంతాల ప్రభుత్వాలు.