Hyderabad Super League : ‘హైదరాబాద్ సూపర్ లీగ్ సబ్ జూనియర్’ సీజన్ 2.. ఫైనల్‌ పోరులో ఛాంపియన్‌గా వారియర్స్ ఎఫ్‌సీ..!

Hyderabad Super League : వారియర్స్ ఎఫ్‌సీ అద్భుతమైన ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచి హైదరాబాద్ సూపర్ లీగ్ సబ్ జూనియర్ సీజన్ 2 ఘనంగా ముగించింది. ఫైనల్స్‌లో వారియర్స్ ఎఫ్‌సీ 1-0 స్వల్ప ఆధిక్యంతో విజయాన్ని అందుకుంది.

Hyderabad Super League : ‘హైదరాబాద్ సూపర్ లీగ్ సబ్ జూనియర్’ సీజన్ 2.. ఫైనల్‌ పోరులో ఛాంపియన్‌గా వారియర్స్ ఎఫ్‌సీ..!

Hyderabad Super League ( Image Source : Google )

Hyderabad Super League : శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ ఆధ్వర్యంలోని ‘హైదరాబాద్ సూపర్ లీగ్ సబ్ జూనియర్ సీజన్ 2’ సీజన్‌ ముగిసింది. లియో 11 వేదికగా జూన్ 9 నుంచి జూలై 21 వరకు ఎనిమిది జట్లు 7-ఎ-సైడ్ ఫార్మాట్‌లో గట్టి పోటీనిచ్చాయి. ఈ లీగ్ సీజన్‌ ఫుట్‌బాల్ ఔత్సాహికులను ఎంతో ఆకట్టుకుంది.

మహ్మద్ అమన్ ఆలం ఆధ్వర్యంలోని వారియర్స్ ఎఫ్‌సీ అద్భుతమైన ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచి హైదరాబాద్ సూపర్ లీగ్ సబ్ జూనియర్ సీజన్ 2 ఘనంగా ముగించింది. ఫైనల్స్‌లో వారియర్స్ ఎఫ్‌సీ 1-0 స్వల్ప ఆధిక్యంతో విజయాన్ని అందుకుంది. కషీఫ్ నిర్ణయాత్మక గోల్‌ మ్యాచ్‌కే హైలెట్‌.

తెలంగాణలో యువతకు ఫుట్‌బాల్ అవకాశాలే లక్ష్యంగా :
హైదరాబాద్ లిటిల్ స్టార్స్ సాకర్ అకాడమీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ లీగ్ ఫుట్‌బాల్‌లో యువత ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణలో యువతకు ఫుట్‌బాల్ అవకాశాలను మరింత పెంచడానికి శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సితో వ్యూహాత్మక భాగస్వామ్యాంతో ముందుకు వెళ్తోంది. ఫుట్‌బాల్ సమగ్ర అభివృద్ధి, ప్రతిభను అన్ని స్థాయిలలో క్రీడను ప్రోత్సహించడంపైనే దృష్టిపెట్టింది.

అందులో భాగంగానే హైదరాబాద్ సూపర్ లీగ్ శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీతో సుదీర్ఘంగా సహకారం అందిస్తుంది. హైదరాబాద్ సూపర్ లీగ్ వ్యవస్థాపకుడు, హైదరాబాద్ లిటిల్ స్టార్స్ సాకర్ అకాడమీ సీఈఓ మొహమ్మద్ ఫైజ్ ఖాన్ ఆధ్వర్యంలో లీగ్‌కు విశేష ఆదరణ లభించింది. డెకాథ్లాన్, శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ, ఇండియా ఖేలో ఫుట్‌బాల్‌కు చెందిన ప్రముఖులు సైతం ఛాంపియన్‌గా నిలిచిన వారియర్స్ ఎఫ్‌సీని అభినందిస్తున్నారు. ఫుట్‌బాల్ కమ్యూనిటీలో ‘హైదరాబాద్ సూపర్ లీగ్’ ప్రాముఖ్యత మరింతగా పెరిగిందని నిర్వాహాకులు తెలిపారు.

Read Also : Rohit Sharma : మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌కు ఎస‌రు పెట్టిన రోహిత్ శ‌ర్మ‌..! శ్రీలంక సిరీస్‌లోనే..!