IND v NEP: మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2024: నేపాల్‌తో మ్యాచ్‌.. చెలరేగిన ఇండియా డాషింగ్ ఓపెనర్

మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2024 గ్రూప్ ఏ మ్యాచ్‌లో భారత్, నేపాల్ జట్లు తలపడుతున్నాయి.

IND v NEP: మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2024: నేపాల్‌తో మ్యాచ్‌.. చెలరేగిన ఇండియా డాషింగ్ ఓపెనర్

Womens Asia Cup 2024 India Women vs Nepal Women Match Live Updates (Photo: @BCCIWomen)

నేపాల్‌ టార్గెట్ 179
నేపాల్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. నేపాల్ ముందు 179 పరుగుల లక్ష్యం ఉంచింది. షఫాలీ వర్మ 81, దయాళన్ హేమలత 47, సజీవన్ సజన 10, జెమిమా రోడ్రిగ్స్ 28, రిచా ఘోష్ 6 పరుగులు చేశారు.

షఫాలీ వర్మ అవుట్
133 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. షఫాలీ వర్మ 48 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 81 పరుగులు చేసి అవుటయింది. భారత్ 18 ఓవర్లలో 154/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

హేమలత అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
122 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. దయాళన్ హేమలత 42 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 47 పరుగులు చేసి అవుటయింది. భారత్ 15 ఓవర్లలో 131/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

భారత్ 10 ఓవర్లలో 91/0
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న భారత్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 54, దయాళన్ హేమలత, 33 పరుగులతో ఆడుతున్నారు.

షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ
ఇండియా డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ చేసింది.  26 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో హాఫ్ సెంచరీ సాధించింది. ఇంటర్నేషన్ టీ20ల్లో ఆమెకిది 10వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

 

టాస్ గెలిచిన భారత్
IND v NEP: మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2024లో భాగంగా ఈరోజు జరుగుతున్న టీ20 మ్యాచ్ లో భారత్, నేపాల్ జట్లు తలపడుతున్నాయి. రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మంధాన.. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. రెండు వ‌రుస విజ‌యాల‌తో భార‌త్ గ్రూపు ఏలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది.

తుది జట్లు

భారత్
షఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాళన్ హేమలత, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సజన, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతీ రెడ్డి

నేపాల్
సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా(కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రీ, పూజ మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ(వికెట్ కీపర్), సబ్‌నమ్ రాయ్, బిందు రావల్

Also Read: ప్రేయ‌సితో ఇంగ్లాండ్ వికెట్ కీప‌ర్ నిశ్చితార్థం.. గ‌డిచిన ఏడాదిలో నాలుగో మ‌హిళా క్రికెట్ జంట‌..!