Mahesh Babu: భోళా శంకర్ సినిమా విడుదలకు కోర్టులో లైన్ క్లియర్ అవ్వగానే మహేశ్ బాబు ట్వీట్

అలాగే, నాగబాబు కూడా స్పందించారు. శుక్రవారం భోళా శంకర్ విడుదల కాబోతుందని, ఈ సినిమా బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని అన్నారు.

Mahesh Babu: భోళా శంకర్ సినిమా విడుదలకు కోర్టులో లైన్ క్లియర్ అవ్వగానే మహేశ్ బాబు ట్వీట్

Mahesh Babu On Bhola Shankar

Mahesh Babu – Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన బోళా శంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవ్వగానే సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. భోళా శంకర్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు.

భోళా శంకర్ రేపు విడుదల అవుతున్న నేపథ్యంలో ” చిరంజీవి సర్‌కి, నా ప్రియ మిత్రుడు మెహర్ రమేశ్‌కి, నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు బెస్ట్ విషెస్ చెబుతున్నాను” అని మహేశ్ పేర్కొన్నాడు.

అలాగే, నాగబాబు కూడా స్పందించారు. శుక్రవారం భోళా శంకర్ విడుదల కాబోతుందని, ఈ సినిమా బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని అన్నారు.

భోళా శంకర్ చూడడానికి బుక్ చేసుకున్న టికెట్ల ఫొటోలను దర్శకుడు సంపత్ నంది పోస్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, ఈ సినిమా నిర్మాతలు తనను మోసం చేశారని చెబుతూ సత్యనారాయణ అనే డిస్ట్రిబ్యూటర్ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ ను కోర్టు కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.

Bhola Shankar: భోళా శంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్.. సంబరాలకు మెగా ఫ్యాన్స్ రెడీ