Rashmika Mandanna : ర‌ష్మిక ‘డిసెంబ‌ర్’ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అవుతుందా..?

సినీ తార‌లు, క్రికెట‌ర్లు, రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రైనా కావొచ్చు.. ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది. చాలా మంది సెల‌బ్రిటీలు సెంటిమెంట్‌ను త‌ప్ప‌క పాటిస్తుంటారు.

Rashmika Mandanna : ర‌ష్మిక ‘డిసెంబ‌ర్’ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అవుతుందా..?

Rashmika Mandanna Lucky month

Rashmika Mandanna Lucky month : సినీ తార‌లు, క్రికెట‌ర్లు, రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రైనా కావొచ్చు.. ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది. చాలా మంది సెల‌బ్రిటీలు సెంటిమెంట్‌ను త‌ప్ప‌క పాటిస్తుంటారు. ఇక సినీ ప‌రిశ్ర‌మ‌లో అయితే ఇది చాలా ఎక్కువ‌. ఏదైన సినిమా ఘ‌న విజ‌యం సాధించింది అంటే ఫ‌లానా హీరో లేదా హీరోయిన్‌ లేదంటే ఫ‌లానా ఆర్టిస్టు లు ఉంటే సినిమా ఖ‌చ్చితంగా ఆడుతుంద‌ని న‌మ్మ‌డాన్నిచూస్తూనే ఉంటాం. ఒక్కొసారీ ఇవి నిజం అవుతుంటాయి కూడా.

ఇక టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతూ ఇటీవ‌లే పుష్ప (Pushpa) చిత్రంతో నేష‌న‌ల్ క్ర‌ష్ మారిన ర‌ష్మిక మంద‌న్న(Rashmika Mandanna)కు కూడా ఓ సెంటిమెంట్ ఉందంట‌. త‌న‌కు డిసెంబ‌ర్ నెల అంటే ఎంతో సెంటిమెంట్ అట‌. ఈ నెల‌ను తాను అదృష్టంగా భావిస్తున్న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో క‌న్న‌డ భామ చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఆ నెల‌లో ఆమె న‌టించిన తొలి సినిమా కిరిక్ పార్టీ (Kirik Party) విడుద‌లైంది. అంతేకాకుండా అమ్మ‌డు న‌టించిన మ‌రో నాలుగు సినిమాలు సైతం అదే నెల‌లో విడుద‌లై ఘ‌న విజ‌యాల‌ను అందుకున్నాయి.

Dinesh karthik : జైలర్ పై దినేశ్ కార్తీక్.. సూప‌ర్‌స్టార్ ఈజ్ ది బెస్ట్ అంటూనే..

“నాకు డిసెంబ‌ర్ అంటే ఎంతో సెంటిమెంట్‌. ఈ నెల‌ను అదృష్టంగా భావిస్తా. నా తొలి సినిమా కిరిక్ పార్టీ ఈ నెల‌లోనే విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదండోయ్‌.. నేను న‌టించిన మ‌రో నాలుగు సినిమాలు సైతం ఈ నెల‌లోనే విడుద‌లైన మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకున్నాయి. అంతఎందుకు నాకు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువ‌చ్చిన సినిమా ‘పుష్ప’ సైతం ఇదే నెల‌లో విడుద‌లైంది. ఇక అతి త్వ‌ర‌లోనే ‘యానిమ‌ల్’ చిత్రం సైతం ఈ నెల‌లోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నేను ఎంతో క‌ష్ట‌మైన పాత్ర‌ను పోషించా. నా కెరీర్‌లో ఇంత వ‌ర‌కు ఇలాంటి పాత్ర‌ చేయ‌లేదు. ప్రేక్ష‌కులు ఆ పాత్ర‌ను ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా.” అని ర‌ష్మిక మంద‌న్న అంది.

ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక‌టి సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ‘యానిమ‌ల్’ సినిమా. ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 1 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న ‘పుష్ప 2’ లోనూ శ్రీవ‌ల్లి న‌టిస్తోంది. ‘రెయిన్ బో’ అనే ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రంలోనూ ర‌ష్మిక న‌టిస్తోంది.

Devara Movie : ఎన్టీఆర్ ‘దేవర’ పాటల అప్డేట్.. దగ్గరుండి రాయించుకుంటున్న డైరెక్టర్..