Bihar Politics: నెహ్రూ నుంచి వాజ్‌పేయి వరకు వచ్చిన పేరు మార్పు రాజకీయం.. తాజాగా అటల్ పార్క్ పేరు మార్పు

కొబ్బరి అనే పదానికి ఎలాంటి రాజకీయ పార్టీల సెంటిమెంట్‌లు లేవు కాబట్టి, ఈ పేరు మార్పుపై ఎలాంటి వివాదం లేదు. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును తొలగించడం పట్ల పెద్ద వివాదమే లేచేలా కనిపిస్తోంది.

Bihar Politics: నెహ్రూ నుంచి వాజ్‌పేయి వరకు వచ్చిన పేరు మార్పు రాజకీయం.. తాజాగా అటల్ పార్క్ పేరు మార్పు

Atal Bihari Vajpayee Park: ఢిల్లీ నుంచి మొదలైన పేరుమార్పు రాజకీయం ఇప్పుడు పాట్నాకు చేరింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీద ఉన్న ‘అటల్ పార్క్’ అనే పేరును బీహార్ ప్రభుత్వం తాజాగా ‘నారియల్ పార్క్’ (కొబ్బరి పార్క్)గా మార్చింది. కాగా దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పట్ల అగౌరవ వైఖరిగా దీనిని అభివర్ణించింది. గతంలో ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మార్చింది. దీనిని కాంగ్రెస్ ప్రస్తావిస్తూ బీజేపీ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Swami Prasad Maurya: రసవత్తరమైన ఓబీసీ మీటింగ్.. స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరిన లాయర్, చితక్కొట్టిన సమాజ్‭వాదీ కార్యకర్తలు

ఇండియా సంకీర్ణంలో కాంగ్రెస్ మిత్రపక్షాలైన జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలోని ప్రభుత్వం అటల్ పార్క్ పేరును మార్చింది. దీంతో రాజకీయాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. బీహార్ ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సోమవారం అటల్ పార్క్ పేరును నారియల్ పార్కుగా మార్చారు. అయితే, గతంలో ఈ పార్కు పేరు నారియల్ పార్కుగానే ఉండేది. 2018లో దాని పేరు అటల్ పార్కుగా నితీశ్ కుమార్ ప్రభుత్వం మార్చింది. మళ్లీ అదే ప్రభుత్వం మరోసారి పేరు మార్చడం గమనార్హం.

Telangana Elections 2023: కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే.. వీరి సంబరాలు మామూలుగా లేవుగా

కొబ్బరి అనే పదానికి ఎలాంటి రాజకీయ పార్టీల సెంటిమెంట్‌లు లేవు కాబట్టి, ఈ పేరు మార్పుపై ఎలాంటి వివాదం లేదు. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును తొలగించడం పట్ల పెద్ద వివాదమే లేచేలా కనిపిస్తోంది. ఆగస్ట్ 16న, తేజ్ ప్రతాప్ యాదవ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అయితే ఒక వారంలోనే అతను అటల్ పార్క్ పేరును మార్చడం గమనార్హం.