Raksha Bandhan 2023 : భద్ర కాలంలో రాఖీ అస్సలు కట్టొద్దు .. మరి ఈ ఏడాది రాఖీ ఎప్పుడు కట్టాలి? ఆగస్టు 30 నా..? 31నా..?

రాఖీ పండుగకు భద్ర కాలానికి సంబంధమేంటీ..? భద్రకాలంలో రాఖీ కట్టకూడదని ఎందుకంటారు? కడితే ఏమవుతుంది? భద్ర కాలం అంటే ఏంటీ..?

Raksha Bandhan 2023 : భద్ర కాలంలో రాఖీ అస్సలు కట్టొద్దు .. మరి ఈ ఏడాది రాఖీ ఎప్పుడు కట్టాలి? ఆగస్టు 30 నా..? 31నా..?

Bhadra kalam Raksha Bandhan 2023

Raksha Bandhan 2023 : రాఖీ పండుగ ప్రతీ ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం అధిక శ్రావణ మాసాలు రావటం ఓ విశేషమైతే..రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి..? అనేది కూడా ఓ ప్రశ్నార్థకంగా మారింది. పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలోనే సోదరులకు రాఖీ కట్టాలి. కానీ ఏడాది (2023) మాత్రం పౌర్ణమి ఏ రోజున వచ్చింది.. పౌర్ణమి ఘడియలు ఎన్నింటి వరకు ఉంటాయి?రాఖీ పౌర్ణమి 30నా, 31నా అనే పెద్ద సందేహం వచ్చింది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో వచ్చింది. అంటే 30,31 .అంటే తగుళ్లు మిగుళ్లు అంటారే అలాగన్నమాట. అంటే పౌర్ణమి రెండురోజులలో ఉంది. అయితే పౌర్ణమి ఘడియల్లోనే రాఖీ కట్టాలి కదా..మరి ఎప్పుడు కట్టాలి..? అనే ధర్మ సందేహంతో సోదరీమణులు తెగ సతమతమైపోతున్నారు. ఒకరు 30 అంటారు మరొకరు 31 అంటారు..మరి ఎప్పుడు కట్టాలి..? అనే అయోమయం నెలకొంది.

ఈ ఏడాది ఆగస్టు 30న భద్రకాలం ఉందట. భద్రకాలంలో రాఖీని అస్సలు కట్టకూడదంటున్నారు. అలా కడితే దోషమని..భధ్ర కాల ప్రభావం వారి(సోదరులపై)పై తీవ్రదుష్ర్పభావం చూపుతుందని అంటున్నారు. భద్రకాలంలో రాఖీ అస్సలు కట్టకూడదని చెబుతున్నారు. భద్రకాలంలో కడితే ఏమవుతుంది? అసలు భద్రకాలం అంటే ఏమిటి? ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి..?

Raksha bandhan 2023 : పురాణాల్లో రక్షా బంధన్ .. ఎవరు ఎవరికి కట్టారో తెలుసా..?

రాఖీ పండుగ,అసలు భద్రకాలం అంటే..
రాఖీ పండుగ ఎంత గొప్పదో దాన్ని జరుపుకునే సమయం అంతకంటే ముఖ్యమైనది. రాఖీపండుగ 30వతేదీనా లేక 31నా అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. భద్రకాలం చాలా ప్రమాదకరం అని ఆ సమయంలో కడితే హాని, నష్టం జరుగుతుందంటారు. భద్ర లంకాధిపతి రావణాసురుడు సోదరి అని చెబుతారు. ( భద్ర శని దేవుడి సోదరి అని కూడా అంటారు) ఇక రావణుడు సోదరిగా చెబుతున్న భధ్ర విషయానికొస్తే.. తన అన్నగారైన రావణుడికి భద్ర పౌర్ణమి అని పొరపాటు పడి రక్షాబంధనాన్ని పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే కట్టిందట. అందుకే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెబుతారు.

అలాగే పురాణాల ప్రకారం సూర్యుడి కుమార్తె భద్ర. అంటే శనిదేవుడి సోదరి. శని స్వరూపంలానే భద్ర కూడా కఠినంగా ఉంటుందంటారు. భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట. అంటే పనులూ అడ్డుకోవడం, శుభకార్యాలకు అడ్డుపడడం చేస్తుందట. భద్ర నిత్యం ముల్లోకాల్లోనూ సంచరిస్తుంటుందని..ఆమె ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు జరగవని అందుకే భద్రకాలం అంటే చాలా ప్రమాదకర కాలం అని పండితులు చెబుతుంటారు. ఆ భద్రకాలంలో మంచిది కాదు. అందుకే భద్ర కాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. అలా ఈ ఏడాది (2023) ఆగస్టు 30న భద్రకాలం వచ్చిందని చెబుతున్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడని సూచిస్తున్నారు.

మరి రాఖీ ఎప్పుడు కట్టాలి..?
పౌర్ణమి ప్రకారం రాఖీ పండుగ 30,31 రెండు తేదీలలో వచ్చింది. అయితే పౌర్ణమి 30వ తేదీ రాత్రి 9.01 గంటలకు ప్రారంభమై 31వ తేదీ ఉదయం 07.05 నిమిషాల వరకు ఉంటుంది. అక్కచెల్లెళ్లుఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుంది. పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు, సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

గమనిక : మాకు అందిన సమాచారం మేరకు ఈ విషయాలు పేర్కొనటం జరిగింది..రాఖీ కట్టే సమయం వంటి విషయాలను మీమీ నిర్ణయాల ప్రకారం అనుసరించగలరు..పండితు సూచనలు పాటించి నిర్ణయించుకోవాలని మనవి..