Fertility Treatments : సంతాన సాఫ‌ల్య చికిత్స‌ల‌కు డిమాండ్.. మ‌హిళ‌ల్లో పెరుగుతున్న ఎగ్ ఫ్రీజింగ్‌!

Fertility Treatments : గత పదేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీఏ) వంటి పరీక్షలతో ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు.

Fertility Treatments : సంతాన సాఫ‌ల్య చికిత్స‌ల‌కు డిమాండ్.. మ‌హిళ‌ల్లో పెరుగుతున్న ఎగ్ ఫ్రీజింగ్‌!

Number of women choosing egg freezing ( Image Source : Google )

Fertility Treatments : ప్రస్తుత రోజుల్లో సంతాన సాఫ‌ల్య చికిత్స‌ల‌కు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. గత దశాబ్దంలో పురుషులలో సంతాన‌రాహిత్య స‌మ‌స్య‌లో గణనీయమైన మార్పు క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో పురుషులు, మ‌హిళ‌ల్లో సంతానరాహిత్యం ఎక్కువగా కనిపిస్తోంది. సంతాన‌సాఫ‌ల్య రేటు రాష్ట్రంలో క్రమంగా త‌గ్గుతోంది.

Read Also :CAPA-IVM Baby : ఏపీలో ఫస్ట్ సీఏపీఏ ఐవీఎమ్ బేబీ జననం.. ఘనంగా బేబీ షవర్ వేడుక! 

పెళ్లి ఆలస్యం, జీవనశైలిలో మార్పులు సంతానలేమి సమస్యకు ముఖ్య కారణమని ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి చికిత్సకు 35 ఏళ్లు పైబడిన మహిళలే ఎక్కువగా వస్తున్నారు. అదే, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సగటు వయస్సు 22ఏళ్ల నుంచి 23 ఏళ్లు ఉండ‌టం ఆందోళనకరం. ఒక్కో మ‌హిళ‌కు స‌గ‌టున 2.1 మంది పిల్ల‌లు ఉండాలి.. కానీ, 1.8 మంది ఉంటున్నారు.

గత పదేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీఏ) వంటి పరీక్షలతో ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు. పిండం ఎంపికలో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి ఐవీఎఫ్ సక్సెస్ రేట్‌కు దోహదపడతాయి.

పిల్ల‌లు పుట్ట‌ని జంట‌ల‌కు కొత్త ఆశ‌, మెరుగైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి. క్రియోప్రిజ‌ర్వేష‌న్ కారణంగా వీర్యం, అండాలు, పిండాల‌ను కూడా స‌మ‌ర్థంగా స్టోర్ చేసే పరిస్థితి ఉంది. వ‌య‌సు పైబడిన త‌ర్వాత కూడా పిల్ల‌లు కావాల‌నుకున్నా సుల‌భ‌మే అవుతుందని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల పేర్కొన్నారు.

పురుషుల సంతాన‌రాహిత్యంలో మార్పు :
సంతాన‌రాహిత్య స‌మ‌స్య‌ల‌కు ప‌రీక్ష‌లకు పురుషులు ముందుకు వస్తున్నారని సంతాన‌సాఫ‌ల్య నిపుణులు అంటున్నారు. ద‌శాబ్దం క్రితం పురుషులు వీర్యం విశ్లేష‌ణకు ముందుకు వచ్చేవారు కాదని చెబుతున్నారు. పురుషుల కారణంగా సంతాన‌రాహిత్య స‌మ‌స్య‌లు ఉంటాయంటే పెద్దగా పట్టించుకోనేవారు కాదు. కానీ, ఇప్పుడు వీర్యం విశ్లేష‌ణ విష‌యంలో పురుషులు ధైర్యంగా ముందుకొస్తున్నారు.

నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సేవలు :
భారత్‌లో సంతాన‌సాఫ‌ల్య చికిత్స‌లు అందించే కేంద్రాల్లో నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ ఒకటి.. నేటితో నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ ప‌దేళ్లు పూర్తిచేసుకుంది. ఇందులో ఆధునిక చికిత్సా ప‌ద్ధ‌తులు, బేసిక్ ఏఆర్‌టీ, అడ్వాన్స్‌డ్ ఏఆర్‌టీ వంటి విధానాల‌తో గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా పెరుగుతాయి. దేశంలోని 54 న‌గ‌రాల్లో నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీకి 85కు పైగా కేంద్రాలున్నాయి.

Read Also : Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!