Tollywood Drugs: టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో పలువురు సినీ ప్రముఖులు!

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని మాధాపూర్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు.

Tollywood Drugs: టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో పలువురు సినీ ప్రముఖులు!

Drugs Case

Drugs In Tollywood: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురిని అధికారులు అరెస్టు చేశారు. వీరిలో సినీ నిర్మాత వెంకట్‌తో పాటు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు,  పలువురు యువతులు ఉన్నట్లు సమాచారం. అరెస్టయిన వారిని మాధాపూర్ పోలీసులకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అప్పగించారు.

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలనం.. కేపీ చౌదరి లిస్టులో సెలబ్రిటీల పేర్లు, ఆ ఇద్దరితో వందల సంఖ్యలో ఫోన్ కాల్స్

రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించే పనిలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి డ్రగ్స్ ఎలా వచ్చింది. ఎవరు సరఫరా చేశారు అనే కోణంలో కూపీలాడుతున్నారు. అంతేకాక, అపార్ట్ మెంట్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో అరెస్టయిన వారితో పాటు మరెవరైనా దాడులకు ముందు పాల్గొన్నారా? అనే కోణంలోనూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలాఉంటే ఇటీవల టాలీవుడ్‌లో నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరిని పోలీసులు విచారించగా.. పలువురి టాలీవుడ్ ఆర్టిస్టుల పేర్లు ప్రస్తావించారు. అయితే, కేపీ చౌదరితో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వారు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సోషల్ మీడియా వేదికల ద్వారా వివరణ ఇచ్చారు.

Tollywood Drugs Case: మళ్లీ టాలీవుడ్ యాక్టర్ల గుండెల్లో భయం

టాలీవుడ్‌కు డ్రగ్స్ కేసులు కొత్త కాదు.. గతంలో చాలా మంది సినీ ప్రముఖులు ఇలాంటి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సిట్ విచారణకుసైతం హాజరయ్యారు. ఇటీవల కేపీ చౌదరి వ్యవహారంతో టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపగా.. తాజాగా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్‌ను గుర్తించడంతో పాటు పలువురు సినీ ప్రముఖులను అరెస్టు చేయడం సినీ ఇండస్ట్రీలో మరోసారి కలకలం సృష్టించింది.