Jill Biden Covid positive : జిల్ బిడెన్ కు కొవిడ్ పాజిటివ్…ప్రెసిడెంట్ బిడెన్‌కు నెగిటివ్

యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ కొవిడ్ -19 బారిన పడ్డారు. జిల్ బిడెన్ కు జరిపిన పరీక్షలో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. యూఎస్ ప్రథమ మహిళ తేలికపాటి లక్షణాలు ఎదుర్కొంటున్నారు....

Jill Biden Covid positive : జిల్ బిడెన్ కు కొవిడ్ పాజిటివ్…ప్రెసిడెంట్ బిడెన్‌కు నెగిటివ్

Jill Biden

Jill Biden Covid positive : యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ కొవిడ్ -19 బారిన పడ్డారు. జిల్ బిడెన్ కు జరిపిన పరీక్షలో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. యూఎస్ ప్రథమ మహిళ తేలికపాటి లక్షణాలు ఎదుర్కొంటున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కరోనా వైరస్ నెగెటివ్ అని పరీక్షల్లో వచ్చిందని వైట్ హౌస్ తెలిపింది. (Jill Biden Covid positive) జి 20 సదస్సులో పాల్గొనేందుకు ప్రెసిడెంట్ బిడెన్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయనకు కొవిడ్ నెగెటివ్ అని వచ్చింది.

Bypolls Polling : విపక్ష ఇండియా కూటమికి తొలి ఎన్నికల పరీక్ష…6 రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

జో బిడెన్ సతీమణికి కొవిడ్ రెండో సారి సోకడం సంచలనం రేపింది. (President Biden tests negative ahead of India visit) బిడెన్ భార్య 72 ఏళ్ల జిల్ బిడెన్ కు గత ఏడాది ఆగస్టు నెలలో చివరిసారిగా కొవిడ్ వచ్చింది. 80 ఏళ్ల ప్రెసిడెంట్ బిడెన్ కు చివరిసారిగా 2022 జులై నెలలో పాజిటివ్ అని వచ్చింది. ప్రథమ మహిళకు కొవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని ఆమె కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజబెత్ అలెగ్జాండర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Aditya L1 : ఆదిత్య ఎల్ 1 రెండో భూకక్ష పెంపు విన్యాసం విజయవంతం…ఇస్రో వెల్లడి

దీంతో జిల్ బిడెన్ డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌ ఇంట్లో ఉంటున్నారు. తన భార్యకు కరోనా సోకడంతో జో బిడెన్ సోమవారం సాయంత్రం నుంచి డెలావేర్ ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వచ్చారు. జిల్ బిడెన్ కు కరోనా సోకడంతో వైట్ హౌస్ వైద్యాధికారులు అప్రమత్తమై చికిత్స అందిస్తున్నారు.