మేము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ- గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

జగన్ ప్రవర్తన నచ్చకనే చాలామంది ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు.

మేము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ- గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

Ganta Srinivasa Rao : ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ అధినేత జగన్.. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ హత్యలు, దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు జగన్. అంతేకాదు ఏపీలో శాంతిభద్రతలు లేనందున.. రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైసీపీ నుంచి అధికార పార్టీలోకి చేరికలు.. రాజకీయాలను మరింత వేడెక్కించాయి. విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఒకేసారి 14మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మరికొందరు కూడా త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చేరికల సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బాంబు పేల్చారు.

తాము గేట్లు గెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందని తెలిపారు. కార్పొరేటర్లు మాత్రమే కాదు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాస రావు చెప్పారు. విశాఖలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ ప్రవర్తన నచ్చకనే చాలామంది ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కేవలం కార్పొరేటర్లే కాదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అటు కార్పొరేటర్లు పార్టీ మారడంతో వైసీపీకి మేయర్ పీఠం చేజారే అవకాశం ఉంది.

”ప్రజలకు, తమకు అందుబాటులో ఉండే నాయకుడిని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరుకుంటున్నారు. చంద్రబాబు అయితే అందరికీ అందుబాటులో ఉంటారని, సీఎంగా ఆయన ప్రతి ఒక్కరి సమస్యలు వింటారు కాబట్టి.. టీడీపీలో జాయిన్ అయ్యేందుకు అనేక మంది వస్తున్నారు. మేము ఎవరినీ బలవంతం పెట్టడం లేదు. వారంతకు వారే పార్టీలోకి వస్తున్నారు. ఇంకా కొందరు కార్పొరేటర్లు టీడీపీలో చేరతామని టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, అందరినీ కాకుండా కొందరినే పార్టీలోకి తీసుకుంటున్నాం. టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఇబ్బందులు తలెత్తకుండా చేరికలు ఉంటాయి. చేరికల వల్ల పార్టీకి విధేయంగా ఉన్న వారికి ఎవరికీ అన్యాయం జరగదు. వారికి సముచిత స్థానం కల్పిస్తాం” అని టీడీపీ ముఖ్య నేతలు వెల్లడించారు.

కార్పొరేటర్లు కాదు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు? అనే డిస్కషన్ మొదలైంది.

Also Read : సిక్కోలు టీడీపీకి వచ్చిన సమస్యేంటి? ఏం జరుగుతోంది?