Naveen Polishetty : ఆ ఒక్క ట్వీట్ చూశాక.. రాత్రంతా నిద్ర పోలేదు
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)లు నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). పి.మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంది.
![Naveen Polishetty : ఆ ఒక్క ట్వీట్ చూశాక.. రాత్రంతా నిద్ర పోలేదు Naveen Polishetty : ఆ ఒక్క ట్వీట్ చూశాక.. రాత్రంతా నిద్ర పోలేదు](https://10tv.in/wp-content/uploads/2023/09/Naveen-Polishetty.jpg)
Naveen Polishetty
Naveen Polishetty : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)లు నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). పి.మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
అనుష్క, నవీన్ కెమిస్ట్రీ ఆకట్టుకోగా, కామెడీకి జనాలు ఫిదా అయ్యారు. సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి. ఈక్రమంలోనే తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ నవీన్ ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నవీన్ వర్జీనియాలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ కోసం సియాటెల్‌కు వెలుతున్నట్లు తెలిపాడు. అయితే వర్షం కారణంగా విమానాలు లేకపోవడంతో 15 గంటలుగా ఎయిర్‌పోర్టులోనే ఉన్నట్లు చెప్పాడు.
Mega157 : చిరంజీవి కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఇక అడ్వెంచర్ షురూ..
వేరే భాషా సినిమాలతో పాటు తాను నటించిన సినిమాను విడుదల చేయడంపై మొదట్లో కంగారు పడినట్లు వెల్లడించాడు. అయితే.. ప్రేక్షకుల నుంచి తన సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను అభినందిస్తూ పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్ల పై నవీన్ మాట్లాడాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) చేసిన ట్వీట్ చూసిన తరువాత తనకు రాత్రి అంతా నిద్ర పట్టలేదన్నాడు. త్వరలోనే వస్తానని, ప్రేక్షకులను కలుసుకుంటానని చెప్పాడు.
Kollywood : తమిళ ఇండస్ట్రీని నమ్ముకొని క్లీన్ బౌల్డ్ అయిన స్టార్ క్రికెటర్లు..
Thank you Telugu audience 🔥❤️🙏 for this blockbuster word of mouth for #MissShettyMrPolishetty. You guys make dreams come true. Feeling emotional ❤️ Here is what I am feeling right now on this tour in America. Thank you 🙏 Go watch the film with your friends and families this… pic.twitter.com/cmgusVEQAO
— Naveen Polishetty (@NaveenPolishety) September 10, 2023
మహేశ్ బాబు ఏమని ట్వీట్ చేశారంటే..?
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాని కుటుంబంతో కలిసి చూశాను. పుల్గా ఎంజామ్ చేశాము. నవీన్ పోలిశెట్టి కామిక్ టైమింగ్ అదిరిపోయింది. అనుష్క శెట్టి ఎప్పటిలాగే బ్రిలియంట్. నిర్మాతలు, దర్శకుడికి, చిత్రయూనిట్ కి సినిమా సక్సెస్ అయినందుకు అభినందనలు అని సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
#MissShettyMrPolishetty… A complete laugh riot… Thoroughly enjoyed it with the family… @NaveenPolishety is spot-on with his comic timing, and @MsAnushkaShetty was brilliant as always. Congratulations to @filmymahesh, @UV_Creations and the entire team on its success!! 👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) September 9, 2023