Apple iPhone 14 Discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,901 తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Apple iPhone 14 Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 14 భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ రెడ్ కలర్ వేరియంట్ రూ. 79,900 నుంచి రూ. 66,999కి తగ్గింది. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే..

Apple iPhone 14 Discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,901 తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

iPhone 14 gets up to Rs 16,901 discount on Flipkart just days ahead of iPhone 15 launch

Apple iPhone 14 Discount : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ కాబోతోంది. అంతకంటే ముందుగానే ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుత 5G ప్రీమియం ఐఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి అతి తక్కువ ధరకు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 (రెడ్) వేరియంట్‌ ధర మాత్రమే తగ్గింది. ఐఫోన్ 15 లాంచ్‌కు కొద్ది రోజుల ముందు ఈ డీల్ అందుబాటులో ఉంటుంది. అయితే, గత ఏడాది ఐఫోన్ మోడల్‌ను కొనుగోలు చేయాలా లేదా 2023 ఐఫోన్ల కోసం వేచి ఉండాలా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ 14 డిస్కౌంట్ డీల్ :
ఐఫోన్ 14 రెడ్ కలర్ వేరియంట్ ధర రూ. 79,900 నుంచి రూ. 66,999కి అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 4వేల డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఐఫోన్ ధరను రూ. 62,999కి సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ యూజర్లు మొత్తం రూ.16,901 డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 రూ. 56,999 ప్రారంభ ధరతో వస్తుంది. ఇప్పటివరకు ఇదే అత్యల్ప ధరగా చెప్పవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ యూజర్లు ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 54,999 ధరతో కొనుగోలు చేయొచ్చు.

Read Also : Apple Wonderlust Event : ఆపిల్ ‘వండర్‌లస్ట్’ లాంచ్ ఈవెంట్.. ఐఫోన్లతో సహా ఏయే కొత్త ప్రొడక్టులు ఉండొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలంటే?

ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 13? ఏది కొనుగోలు చేయాలి? :
ఐఫోన్ 15 కెమెరా, బ్యాటరీ, చిప్‌సెట్, డిజైన్ ఎలా ఉందో లీక్ డేటా సూచిస్తుంది. అయితే, ఈ అప్‌డేట్ అధిక ధరతో రావచ్చు. ఆపిల్ కొత్త ఫోన్‌ను అదే పాత ధర రూ. 80వేల వద్ద లాంచ్ చేయొచ్చు. లేటెస్ట్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఐఫోన్ 15 వేచి ఉండటం విలువైనదే కావచ్చు. బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ ఐఫోన్ 14 కన్నా ఐఫోన్ 13 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

iPhone 14 gets up to Rs 16,901 discount on Flipkart just days ahead of iPhone 15 launch

Apple iPhone 14 Discount : gets up to Rs 16,901 discount on Flipkart just days ahead of iPhone 15 launch

ఐఫోన్ 13 రెండేళ్ల నాటి 5G మోడల్ అని గమనించాలి. ఐఫోన్ 14కి ఒకే విధమైన ఫీచర్లను అందిస్తుంది. అదే విధమైన పర్ఫార్మెన్స్ పొందవచ్చు. ఒకే కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్, చిప్‌సెట్ ఉన్నాయి. డిజైన్ ఆపిల్ ఇటీవలి మోడల్‌లకు అనుగుణంగా ఉంది. ఐఫోన్ 11 నాటిదిగా చెప్పవచ్చు.

ఒకవేళ, మీకు ఆసక్తి ఉంటే.. ఐఫోన్ 13 మోడల్ కూడా ఎంచుకోవచ్చు. సుమారు రూ. 80వేలు లేదా అంతకంటే ఎక్కువ బడ్జెట్ ఉన్నవారు ఐఫోన్ 15 కొనుగోలు చేయొచ్చు. లేదంటే.. ఐఫోన్ 13ని ఇప్పుడే కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. ఐఫోన్ 15 లాంచ్ చేసిన తర్వాత కూడా ధరలు అలాగే ఉంటాయి.

ఆపిల్ సాధారణంగా కొత్త మోడల్ లాంచ్ చేసినప్పుడు.. పాత మోడల్‌ ధరలను తగ్గిస్తుంది. ప్రస్తుతం, ఐఫోన్ 14 అధికారికంగా ఆపిల్ స్టోర్‌లో రూ. 79,900గా ఉంది. అయితే, ఐఫోన్ 13 రూ. 69,900కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 2 ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Read Also : Nokia G42 5G Smartphone : అద్భుతమైన ఫీచర్లతో నోకియా G42 5G ఫోన్.. వాటర్ రెసిస్టెంట్ డిజైన్, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!