Pests in Rice : వరిలో పెరిగిన పురుగులు, తెగుళ్ల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఈ గుడ్లపై, తన రెక్కల నూగును కప్పివుంచుతుంది. 5-9రోజుల్లో ఈ గుడ్లనుంచి పిల్లపురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలుచేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగు జేస్తుంది.

Pests in Rice : వరిలో పెరిగిన పురుగులు, తెగుళ్ల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Pest Control In Paddy

Pests in Rice : వరి వివిధ ప్రాంతాలలో పిలక దశలో ఉంది. అయితే వరుసగా కురిసిన వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణం కారణంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల పురుగులు, తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు.

READ ALSO : ED Raids : అక్రమ ఇసుక మైనింగ్ కేసులో ఈడీ దాడులు

ఈ ఏడాది వర్షాలు సకాలంలో రావడంతో, ఖరీఫ్ వరి సమయానుకూలంగా సాగుచేశారు రైతులు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పిలక దశలో ఉంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చీడపీడలు అధికంగా ఆశించే సమయం. ఇందుకు అనుగుణంగానే వాతావరణం కూడా ఉంది. వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉల్లికోడు, కాండంతొలుపుచుపురుగు, సుడిదోమ ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి.

READ ALSO : రోజూ 6గంటల కంటే తక్కువ నిద్రపోతే గుండెపోటు..!

ముఖ్యంగా కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. దీని తల్లి రెక్కలపురుగు గోధుమ రంగులో వుండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి వుంటుంది.  ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు  పెడుతుంది.  ఈ గుడ్లపై, తన రెక్కల నూగును కప్పివుంచుతుంది. 5-9రోజుల్లో ఈ గుడ్లనుంచి పిల్లపురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలుచేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగు జేస్తుంది. ఈ పురుగును  సకాలంలో నివారించకపోతే 20-30 శాతం దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ, దీని నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు  శ్రీకాకుళం జిల్లా, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. పి. ఉదయబాబు, శాస్త్రవేత్త

READ ALSO : Nipah virus : కరోనా కంటే నిపా వైరస్ మరణాల రేటు అధికం…ఐసీఎంఆర్ హెచ్చరిక

మబ్బులతో కూడాని వాతావరణం ఉండటం వలన చాలా చోట్ల అగ్గితెగులు, పాముపుడ, కాండంకుళ్లు తెగుళ్లు సోకేందుకు అవకాశం ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో జింక్ దాతు లోపం ఎక్కువగా కనిపిస్తోంది. వీటినిని సకాలంలో అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.