Telangana BJP : తెలంగాణ బీజేపీ నేతల రహస్య సమావేశం, ఈటల తీరుపై తీవ్ర అసంతృప్తి.. అసలేం జరుగుతోంది?

బండి సంజయ్ ను అమిత్ షా కలవడం సహజమే అయినా ఈటల రాజేందర్ కు ప్రాధాన్యం ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. Telangana BJP - Eatala Rajender

Telangana BJP : తెలంగాణ బీజేపీ నేతల రహస్య సమావేశం, ఈటల తీరుపై తీవ్ర అసంతృప్తి.. అసలేం జరుగుతోంది?

Telangana BJP

Telangana BJP – Eatala Rajender : తెలంగాణ బీజేపీ నేతలు రసహ్యంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో వివేక్, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు గరికపటి మోహన్ రావు, ఏనురు రవీందర్ హాజరయ్యారు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఈటల రాజేందర్ వ్యవహారశైలిపై ప్రధానంగా డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ టూర్ లో భాగంగా కొంతమంది నేతలను మాత్రమే కలవడంపైనా వారు చర్చించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ను కలవడం సహజమే అయినా ఈటల రాజేందర్ కు ప్రాధాన్యం ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read..KVP: కేవీపీపై రేవంత్‌రెడ్డికి కోపమెందుకు.. బీఆర్ఎస్‌కు వచ్చిన ఇబ్బందేంటి?

నియోజకవర్గాల్లో చేరికల విషయంలో సీనియర్లను ఈటల రాజేందర్ సంప్రదించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ములుగు నుంచి మాజీమంత్రి చందూలాల్ కుమారుడు బీజేపీలో చేరడం, సంగారెడ్డిలో పులిమామిడి రాజు చేరికలపై వారు ఆగ్రహంతో ఉన్నారు. తమను కనీసం సంప్రదించకుండానే ఏకపక్షంగా వారిని పార్టీలో చేర్చుకున్నారని ఈటల రాజేందర్ పై బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జులు మండిపడుతున్నారు.

కాగా, హైదరాబాద్ విమోచన దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తోనూ భేటీ అయ్యారు.

Also Read..Sonia Gandhi: కర్ణాటకకు అప్పుడు 5 హామీలే.. తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించిన సోనియా