Congress : అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచిన కాంగ్రెస్.. ఆశావాహులంతా ఢిల్లీ బాట

తొలి విడత జాబితాలో సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో బలమైన నేతలకు స్థానం కల్పించారు. 35 నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్థులు బలంగా పోటీ పడుతున్నట్లు గుర్తించారు.

Congress : అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచిన కాంగ్రెస్.. ఆశావాహులంతా ఢిల్లీ బాట

Telangana Congress (1)

Congress Candidates Selection : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ వేగం పెంచింది. గురువారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ వార్ రూమ్ లో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగింది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు మరో స్క్రీనింగ్ కమిటీ సారి భేటీ కానుంది. 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. 40 నియోజకవర్గాల్లో సింగిల్ నేమ్ లను ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ డిసైడ్ చేసింది.

తొలి విడత జాబితాలో సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో బలమైన నేతలకు స్థానం కల్పించారు. 35 నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్థులు బలంగా పోటీ పడుతున్నట్లు గుర్తించారు. మిగతా చోట్ల ముగ్గురు లేదా నలుగురు అభ్యర్థుల పోటీ పడుతున్నారు. టికెట్ దక్కని నేతలకు వారి ప్రాధాన్యతలను బట్టి ఏఐసీసీ పెద్దలు నచ్చ చెప్పాలని నిర్ణయించారు. టికెట్ దక్కని వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక పలు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Manikrao Thakre: ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై పూర్తి వివరాలు తెలిపిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్

ఈ నెలాఖరులోపు మొదటి విడత జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ నిర్ణయించారు. అక్టోబర్ మొదటి వారంలో రెండో విడత, రెండో వారంలో మూడో విడత జాబితాను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టికెట్ ల ఎంపిక తుది దశకు రావడంతో ఆశావాహులంతా ఢిల్లీ బాట పట్టారు. తెలంగాణ నేతలు రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు.