Xiaomi 14T Pro Series : షావోమీ 14టీ ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్..!

Xiaomi 14T Pro Series : షావోమీ 14టీ, షావోమీ 14టీ ప్రో టైటానియం బ్లాక్, టైటానియం బ్లూ, టైటానియం గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయని వెబ్‌సైట్ తెలిపింది. షావోమీ 14 ప్రో టైటానియం బాడీ, శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్టుతో ప్రత్యేక వేరియంట్‌లో అందించనుంది.

Xiaomi 14T Pro Series : షావోమీ 14టీ ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్..!

Xiaomi 14T And 14T Pro Pricing ( Image Source : Google )

Xiaomi 14T Pro Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి సరికొత్త షావోమీ 14టీ, షావోమీ 14టీ ప్రో త్వరలో లాంచ్ కానుంది. అయితే, కంపెనీ ఏడాది క్రితమే లాంచ్ అయిన షావోమీ 13టీ సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్.

Read Also : Redmi Buds 5 First Sale : భారత్‌లో రెడ్‌మి బడ్స్ 5 సిరీస్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు హై-ఎండ్ హ్యాండ్‌సెట్‌లను లాంచ్ చేసే ప్రణాళికలను ఇంకా ప్రకటించలేదు. వెబ్‌సైట్ ఐరోపాలో ధరలు, లభ్యతతో సహా అనేక వివరాలను లీక్ చేసింది. షావోమీ 14టీ, షావోమీ 14టీ ప్రో రెండూ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌ల ద్వారా పవర్ పొందవచ్చు. కంపెనీ హైపర్‌ఓఎస్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుందని నివేదిక తెలిపింది.

షావోమీ 14టీ, 14టీ ప్రో ధర లభ్యత (లీక్) :
ఫ్రెంచ్ వెబ్‌సైట్ డీలాబ్స్ యూరప్‌లో షావోమీ 14టీ, షావోమీ 14టీ ప్రో ధరలను లీక్ చేసింది. షావోమీ 14టీ ధర 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో ఈయూఆర్ 649 (సుమారు రూ. 60,100)గా ఉండనుంది. అయితే, షావోమీ 14టీ ప్రో 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీతో ఈయూఆర్ 899 (సుమారు రూ. 83,300)కు పొందవచ్చు.

షావోమీ 14టీ, షావోమీ 14టీ ప్రో టైటానియం బ్లాక్, టైటానియం బ్లూ, టైటానియం గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయని వెబ్‌సైట్ తెలిపింది. షావోమీ 14 ప్రో టైటానియం బాడీ, శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్టుతో ప్రత్యేక వేరియంట్‌లో అందించనుంది. కంపెనీ రాబోయే హ్యాండ్‌సెట్‌లు టైటానియం ఫ్రేమ్‌లను కలిగి ఉంటాయో లేదో ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది.

షావోమీ 14టీ, షావోమీ 14T ప్రో స్పెసిఫికేషన్‌లు (లీక్) :
వెబ్‌సైట్ లీక్ వివరాల ప్రకారం.. షావోమీ 14టీ 12జీబీ ర్యామ్, 256జీ స్టోరేజ్‌తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 8300-అల్ట్రా ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. అయితే, షావోమీ 14టీ ప్రో డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో పాటు 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ కలిగి ఉంటుంది.

రెండు ఫోన్‌లు 6.67-అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్‌తో 144Hz రిఫ్రెష్ రేట్, 1,600నిట్స్ గరిష్ట ప్రకాశం, హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10 ప్లస్, డాల్బీ విజన్‌లకు సపోర్టు అందిస్తాయి. షావోమీ 14టీ సిరీస్‌లోని రెండు మోడల్‌లు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2.6ఎక్స్ జూమ్‌తో కూడిన 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 12ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా నేతృత్వంలోని లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అమర్చి ఉంటాయి.

120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో ఫ్రంట్ సైడ్ రెండు ఫోన్‌లు 32ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటాయి. కనెక్టివిటీ పరంగా షావోమీ 14టీ, షావోమీ 14టీ ప్రో వరుసగా వై-ఫై 6ఈ, వై-ఫై 7 నెట్‌వర్క్‌లకు సపోర్టు అందిస్తాయి. రెండు ఫోన్‌లు బ్లూటూత్ 5.4, 5జీ, 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీకి సపోర్టును అందిస్తాయి. 5,000mAh బ్యాటరీలను కూడా ప్యాక్ చేసే అవకాశం ఉంది. షావోమీ ప్రో మోడల్ 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ల గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Also : Redmi 14C Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి 14సి ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే..!